Vastu Tips Telugu: ఈ చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు.. మీరు కూడా ట్రై చేయండి!

కొన్ని వాస్తు టిప్స్‌ ఫాలో అయితే లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేకుండా చూసుకోండి. ఆగ్నేయ దిశలో నీలం రంగు ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు.

New Update
Vastu Tips Telugu: ఈ చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు.. మీరు కూడా ట్రై చేయండి!

Vastu Tips Telugu: చాలామందికి జీవితంలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. కొంతమంది ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నెల చివరకు మిగలవు. ఆఫీస్‌లో ఎంత జీతం వచ్చినా అది సరిపోక చాలామంది అప్పులు చేస్తారు. ఆ అప్పులు తీర్చేలోపే జీవితం గడిచిపోతుంది. ఇక హ్యాపీగా ఉండేది ఎప్పుడు? అందుకే వాస్తు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి ప్రయత్నిస్తే డబ్బు సమస్య తీరుపోతుందట! దీనిని కొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

 Vastu Tips

డబ్బులు కోసం వాస్తు చిట్కాలు:

  • తెల్లటి పిగ్గీ బ్యాంకును ఉత్తరం వైపుగా ఉంచండి. కొంతమంది డబ్బులు పొదుపు చేయడానికి కుండలను వాడుతారు. డబ్బులు పొదుపు చేసుకునే ఈ వస్తువు అయినా సరే దాన్ని ఉత్తరం వైపునే ఉంచాలి.
  • మీ ఇంటికి ఆగ్నేయ దిశ రాగి పాత్రను ఉంచండి. దీని వల్ల ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
  • ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేదా చెత్త లేకుండా చూసుకోండి.
  • నీలిరంగు షేడ్స్ కళ్లకు ఓదార్పునిస్తాయి. కానీ ఆగ్నేయ దిశలో నీలం రంగు ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
  • ముఖ్యమైన పత్రాలు, విలువైన నగదు, ఆభరణాలను ఇంటి పశ్చిమ భాగంలో ఉంచడం మంచిది.
  • ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మిదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది.
  • వర్షాలు కురిసినప్పుడు, పైకప్పులు, గోడలు లేదా అడ్డుపడే పైపుల నుంచి నీటి లీకేజీలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే వీటి కారణంగా చాలా డబ్బు వృధా అవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి.. గుడ్డిగా నమ్మవద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు