Vastu Tips : వాస్తు కోసం ఈ 4 మొక్కలు.. నాటితే డబ్బే డబ్బు!

జాబ్‌లో ప్రమోషన్ కావాలా? వ్యాపారంలో లాభం ఉండాలా? ఎంత కష్టపడుతున్నా డబ్బులు రావడం లేదా.?వాస్తు ప్రాబ్లెయ్‌ కావొచ్చు. ఐశ్వర్యం పొందలంటే వాస్తు ప్రకారం ఇంటిలో లేదా చుట్టుపక్కల పారిజాత, శ్వేతార్క్, వేప లేదా కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Vastu Tips : వాస్తు కోసం ఈ 4 మొక్కలు.. నాటితే డబ్బే డబ్బు!

Plants For Vastu :  ప్రతి వ్యక్తి ఆనందం కావాలి. అందుకే కష్టపడి చేసే పనిని ఇష్టపడి చేస్తాడు. అయితే కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితాలు లభించవు. దీనికి ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోవడమేనంటారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇంట్లో ఆర్థిక స్థితిని బలోపేతం చేసే కొన్ని చెట్లు(Trees), మొక్కలు(Plants) ఉన్నాయంటున్నారు. ఐశ్వర్యం పొందలంటే వాస్తు(Vastu Tips) ప్రకారం ఇంటిలో లేదా చుట్టుపక్కల ఏయే చెట్లు, మొక్కలు నాటాలో తెలుసుకుందాం.

వేప లేదా కరివేపాకు:
ఈ రెండు మొక్కలు చాలా శుభప్రదం. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ(Positive Energy) వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం చేసే మొక్కలు ఇవి. ఇంటి ఉత్తర దిశలో ఈ మొక్కలను నాటడం జీవితంలో కొత్త పురోగతికి బాటలు వేస్తుంది. ఈ దిశలో నాటిన ఈ మొక్క మీ వ్యాపారానికి దీవెనలు అందిస్తుంది.

ఉసిరి:
వాస్తు శాస్త్రంలో ఉసిరి(Amla) చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు వల్ల నెగటివ్ ఎనర్జీ నాశనమవుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఉసిరి చెట్టులో విష్ణువు తల్లి లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. మీరు ఇంట్లో ఉసిరి చెట్టును నాటినట్లయితే దాన్ని ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటవచ్చు. ఈ దిక్కున నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పెట్టడం ద్వారా, అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

శ్వేతార్క్:
పురాణాలలో శ్వేతార్క్(Swethark) గణేశుని రూపంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కకు పసుపు సమర్పించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. అదే సమయంలో ఆనందం, శాంతి ఉంటాయి. ఈ మొక్కలోని పూలను శివునికి, గణేశుడికి సమర్పించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది. ఈ మొక్క శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంట్లో ఉంటాయి. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని వాస్తు నమ్మకం.

పారిజాత:
మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి, నారాయణుడు స్వయంగా పారిజాత చెట్టుపై నివసిస్తారు. ఉత్తర దిశలో పారిజాత చెట్టును నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవికి పారిజాత పుష్పం చాలా ప్రీతికరమైనదని శాస్త్రాలలో చెప్పారు. పారిజాత చెట్టును ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంటికి శుభాలు చేకూరుతాయి. పారిజాత మొక్కను వాస్తు ప్రకారం నాటితే ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదు.

గమినిక: ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు.

Also Read : బుగ్గలకు లిప్‌స్టిక్‌ రాసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు