Vasthu tips: గుమ్మం ముందు ఇవి ఉన్నాయా..వెంటనే తీసేయండి..లేకపోతే..!

ఇంటికి ప్రధానమైనది గుమ్మం.దర్వాజా ముందు ముళ్లు, చెప్పులు, అద్దాలు వంటివి పెట్టడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ ఇంటి లోపలికి ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vasthu tips: గుమ్మం ముందు ఇవి ఉన్నాయా..వెంటనే తీసేయండి..లేకపోతే..!
New Update

ఇళ్లు అంటేనే వాస్తు ప్రకారం..అన్ని ఓ పద్దతి ప్రకారం ఉండాలని వాస్తు నిపుణులు అంటారు. అప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అంటారు. మరీ ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంటి గుమ్మం వద్ద ఉంచితే మాత్రం జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అని నిపుణులు అంటున్నారు. మరి గుమ్మం ముందు ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం....

ముళ్లు: ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ల చెట్టుని అసలు పెట్టకూడదు. కాక్టస్‌, గులాబీ మొక్క వంటివి పెంచకూడదు. అంతేకాకుండా ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలు కూడా పెట్టకూడదు. దీని వల్ల జీవితంలో చాలా దురదృష్టం వస్తుందని నిపుణులు అంటున్నారు.

అద్దాలు: చాలా మంది గుమ్మంలో , ముందు తలుపు దగ్గర చాలా మంది అద్దాలు పెడుతుంటారు. దాని వల్ల ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అద్దాలు, గాజు వస్తువులు గుమ్మం ముందు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి.

ఆయుధాలు: ఇంటికి ఎదురుగా కత్తులు, గొడ్డళ్లు, గునుపాలు వంటి ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతాయని పెద్దలు అంటున్నారు. వీటిని ఎల్లప్పుడూ కూడా స్టోర్‌ రూమ్‌ లో ఓ మూలన పెట్టాలి.

పగిలిన, విరిగిన వస్తువులు: విరిగిన వస్తువులను ఇంటి ముందు పెట్టడం అంత మంచిది కాదు. దీని వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. విరిగిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు.

చెప్పులు: గుమ్మం ముందు చెప్పులను ఇంటికి ఎదురుగా విడవకూడదు. గుమ్మానికి పక్కగా చెప్పులు ఉంచాలి. ఇలా చేయడం మంచిదని పండితులు అంటున్నారు. చెప్పులను ఎలా పడితే అలా విడవకుండా ఓ స్టాండ్ లో పెట్టుకుంటే మంచిది.

చెత్త: చెత్తను ఇంటి గుమ్మంలో కానీ తలుపు దగ్గర కానీ అసలు పెట్టకూడదు. ఇది మంచిది కాదు. నెగిటివ్‌ఎనర్జీని ఇంట్లోకి తీసుకుని వస్తుంది. చెత్తను ఇంటి ముందు కాకుండా ఇంటి వెనకాల పెట్టడం మంచిదని అంటున్నారు నిపుణులు. చెత్తను ఇంటి ముందు కాకుండా..ఇంటి వెనకాల పెట్టడం బెటర్ అంటున్నారు నిపుణులు . చెత్తని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే మరింత మంచిదని చెబుతున్నారు.

వెలుగు: ఇంటి గుమ్మం ముందు ఎల్లప్పుడూ కూడా వెలుగు ఉండాలి. చీకటి అస్పలు ఉండకూడదు. దీని వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, గుమ్మం ముందు ఎక్కువగా వెలుతురు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వీలైతే కొన్ని లైట్లు పెట్టడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

#vasthu-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe