VASTU: మన జేవితంలో ఆర్ధిక సమస్యలు ఎదురయినప్పుడు మానసికంగా చాలా క్రుంగిపోతూ ఉంటాము. ఎంత ప్రయత్నించిన పరిష్కార మార్గాలు కనుచూపుమేరలో కనిపించవు అప్పుల కోసం ప్రయత్నిస్తుంటారు తప్ప మన ఇంటిలోనే కొన్నిపరిష్కార మార్గాలున్నాయని గుర్తించరు.
మీ చేతిలో డబ్బు నిలవడం లేదా ?
ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి, ఇంటి ఉత్తర దిశలో ఈ వస్తువును పెట్టడం వల్ల డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు.చాలా మంది కస్టపడి పని చేస్తారు. కానీ .. ఆశించిన స్తాయిలో ఫలితాలు రావడం లేదని గగ్గోలు పెడుతుంటారు. డబ్బు ఇంట్లోకి వస్తుంది, కానీ అది వచ్చిన వెంటనే, ఖర్చయిపోతుంది. అవసరాలకు చేతికి అందుబాటులో ఉండదు, అలాంటి టైమ్లో వాస్తు ద్వారా పరిష్కారం లభిస్తుంది.
ఈ చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచండి
మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతుంటే ఇంటి ఉత్తర దిశలో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి , సంపద యొక్క దేవుడు కుబేరుని చిత్రాన్ని ఉంచండి. ఇది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. ఉత్తరం వైపున లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం పెడితే ఆ ఇంట్లో అమ్మవారు నివసిస్తుందని నమ్ముతారు.
కుబేర దేవుడి ఆశీస్సులు
లక్ష్మీదేవి ఎవరినైనా ప్రసన్నం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంటి ఉత్తర దిశలో కుబేర దేవుడి చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. మీరు అప్పులతో చుట్టుముట్టినట్లయితే లేదా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఈ చర్యలతో, కుబేర దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి.
ఇంట్లో అద్ధం ఏ దిక్కున ఉండాలి
ఇక.. ఇంట్లో మనం నిత్యం చూసుకునే అద్దం పెట్టె విషయంలో కుడా వాస్తు ప్రభావం చూపిస్తుంది. అద్దాన్ని ఎలా పడితే అలా .. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వలన కూడా ఆర్దికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అద్దాన్ని ఈశాన్యపు గదిలో ఉత్తర ఈశాన్యంలో పెడితే ఆ అంటికి లక్ష్మీ దేవి కలిసి వస్తుంది.
ఇంటి గుమ్మం ముందు ఇలా చేయకండి
చాలా మంది ఇంటి గుమ్మం ముందే చెప్పులు విడిచిపెడతారు. కాస్త పక్కకు కూడా పెట్టరు. ఇలా చయడం వల్ల ఆర్ధిక సమస్యలు ఎక్కువుతాయి. ఇంటి ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వస్తువులు పెడితే లక్షీ దేవి కుడా ప్రసన్నం చేసుకుంటుంది.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యం, మతపరమైన సమాచారాల ఆడారంగా ఇవ్వడం జరిగింది.RTV ఏ విధమైన నమ్మకం లేదా సమాచారాన్ని నిర్ధారించదు. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే. వీటిని అమలు చేయడానికి ముందు, దయచేసి పరిశోధన చేయండి. జ్యోతిష్యుడు లేదా వాస్తు పండితులను సంప్రదించండి)
ALSO READ:సుందరకాండ నిత్య పారాయణం చేస్తున్నారా ? అయితే .. ఈ జాగ్రత్తలు తప్పని సరి!!