TTD: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఆలయంలో జరిగే పలు సేవలను రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేట్టు మూడురోజుల పాటు సాలకట్ల ఉత్సవాలు జరుపుతారు. మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని 4 మాడవీధులలో ఊరేగించారు. తర్వాత వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు. వసంతోత్సవ అభిషేక, నివేదనలు పూర్తి చేసి ఆలయానికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: ఎండాకాలం ఎంత మజ్జిగ తాగాలి?..ఏ సమయంలో తాగాలి..?
రేపు మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. తర్వాత వసంత మండపంలో వసంతోత్సవాన్ని జరిపిస్తారు. చివరి రోజు 23న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఆలయానికి వేంచేస్తారు.
ఇది కూడా చదవండి: చర్మం టానింగ్‌ను తగ్గించి మెరిపించే బంగాళాదుంప రసం
ఈ వసంతోత్సవాల కారణంగా రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుపుతారు. పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు-చందనంతో అభిషేకం జరిపిస్తారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం కన్నులపండుగగా జరుపుతారు. వసంత ఋతువులో మలయప్పస్వామికి చేసే ఉత్సవాన్ని వసంతోత్సవం అంటారు. ఇందులో సుగంధ పుష్పాలను సమర్పించటమే కాకుండా రకరకాల పండ్లను నివేదిస్తారు. వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పాద పద్మారాధన, మూడురోజులు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల్ని టీటీడీ అధికారులు రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: ఈ పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకండి..చాలా ప్రమాదం