ఆ కండిషన్ కి ఓకే అంటేనే పెళ్లి?

New Update
ఆ కండిషన్ కి ఓకే అంటేనే పెళ్లి?

మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారు. రీసెంట్ గా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈ జంట. ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

varun tej Agreed To lavanya Condition

లావణ్య, వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే పెళ్లికి రెడీ అని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. లావణ్యకి భరతనాట్యం అంటే చాలా పిచ్చి. అయితే.. పెళ్లయ్యాక కూడా స్టేజ్ పై భరతనాట్యం చేసే ఛాన్స్ వస్తే, అస్సలు వదులుకోనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ దీనికి అడ్డు చెబితే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని, ఈ విషయంలో నాకు కండిషన్లు పెట్టకూడదు అని వరుణ్ తేజ్ తో ముందే చెప్పిందట.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాను కానీ ప్రొడక్షన్ వైపు వెళ్తానని, మెగా ఫ్యామిలీతో మాట తీసుకుందట లావణ్య. అలాగే, మెగా ఫ్యామిలీ పరువు పోయే పని ఎప్పుడూ కూడా చేయను అని అందట. ఇక లావణ్య పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని, నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్ని వరుణ్ తేజ్ ఒప్పుకున్నాకే, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

ఇక మెగా ఫ్యామిలీ కూడా ఆమెకు కండిషన్స్ పెట్టిందని సమాచారం. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందని టాక్. అయితే.. వీరి జాతకం ప్రకారం ఇటలీలో పెళ్లి జరిగితే సంసారం సాఫీగా సాగుందని పండితులు చెప్పినట్లు ఓ వార్త వినిపిస్తోంది. మరి నాగబాబు పెళ్లి ఎక్కడ చేస్తాడో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు