Varun-Lavanya Marriage: లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్ డిజైన్ వెనుక స్టోరీ తెలిస్తే షాక్..!

మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీళ్ళ కాస్ట్యూమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కాస్ట్యూమ్స్ ను ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని తెలుస్తోంది.

New Update
Varun-Lavanya Marriage: లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్ డిజైన్ వెనుక స్టోరీ తెలిస్తే షాక్..!

Varun-Lavanya Marriage: మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి సంబంధించిన ప్రతీదీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దానికి తగినట్లే వాళ్ళ పెళ్లి కూడా ఇటలీలోని టుస్కానీ నగరంలో ప్లాన్ చేశారు. ఇక ఇటలీలోని వీరి పెళ్లి వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు కొంత మంది సెలబ్రెటీస్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీళ్ళ కాస్ట్యూమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

publive-image

మెగా కపుల్ హల్దీ ఫంక్షన్ లో వైబ్రెంట్ కలర్స్ తో ఉండేలా కాస్ట్యూమ్ ప్లాన్ చేశారు. ఇక వీరిద్దరి వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. హల్దీ ఈవెంట్ లో వరుణ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఎల్లో కుర్తా ధరించారు. ఇక హల్దీ కోసం లావణ్య డిజైన్ చేయించుకున్న లెహంగా వెనుక ఒక స్పెషల్ స్టోరీ ఉంది.

గతంలో నిహారిక తన పెళ్ళిలో వాళ్ళ అమ్మ చీరను ట్రెండీ గా డిజైన్ చేయించుకొని.. తనకు ఎంతో ప్రత్యేకమైన తన పెళ్లి వేడుకల్లో ధరించింది. ఇక ఇదే తరహాలో లావణ్య త్రిపాఠి తన స్పెషల్ ఈవెంట్ లో డిజైనర్  డ్రెస్ కాకుండా.. సెంటిమెంట్ గా భావించిన తన అమ్మ చీర నుంచి డిజైన్ చేసిన లెహంగా దాని పై కేప్ ధరించారు. ఈ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

వరుణ్, లావణ్య వివాహ వస్త్రాలను ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇక వీళ్ళ వెడ్డింగ్ లుక్ ఎలా ఉండబోతుందని చాలా ఆసక్తిగా ఉన్నారు. వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఒక ప్రత్యేక థీమ్ తో ప్లాన్ చేశారు వరుణ్ లావణ్య. దీనికి సంబంధించి పెళ్లి కోసం ఇటలీ వెళ్లే ముందే డిజైనర్ మనీష్ మల్హోత్రాను కలిశారు. అంతే కాదు పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీలో అంతా ప్రత్యేకమైన వస్త్రాలంకారణలో కనిపిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. గతంలో నిహారిక పెళ్లి కాస్ట్యూమ్స్ కు  సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకున్నాయి.

publive-image

publive-image

Also Read: Varun-Lavanya Marriage: కొడుకు పెళ్ళికి దూరంగా పవన్ కళ్యాణ్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు