/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-75-jpg.webp)
Varun-Lavanya Marriage: మెగా కపుల్ వరుణ్, లావణ్య పెళ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈరోజు మధ్యాహ్నం చాలా గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుకల కోసం ఇటలీ చేరుకున్నారు. ఈ మెగా కపుల్ నిన్న ప్రీ వెడ్డింగ్ వేడుకలను పూర్తి చేసుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొని సందడి చేశారు. వరుణ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఫొటోల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్.. ఇంట్రోవర్ట్ అందరితో అంత త్వరగా కలవలేడు.. చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ అంతే అని చిరంజీవి, నాగాబాబు చెబుతుంటారు. ఇక ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్ళిలో కూడా మెగా ఫ్యామిలీ అంతా సందడి చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క ఫొటోలో కూడా కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెళ్ళిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి అందరు కనిపిస్తున్నారు మా పవర్ స్టార్ మాత్రం కనిపించడం లేదని కాస్త నిరాశ చెందుతున్నారు.
గతంలో జరిగిన నిహారిక పెళ్ళిలో కూడా.. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫొటోల్లో కనిపించలేదు. తన కొడుకు అకీరా, ఆద్య తో ఉన్న ఫొటోలో మాత్రం కనిపించారు. ఇక పవన్ కళ్యాణ్ ఫొటోల్లో కనిపించకుండా ఉండడంతో.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ , ట్రోల్స్ వైరలవుతున్నాయి. అన్నా .. పెళ్లి కోసం ఇటలీ వెళ్ళింది హోటల్ రూమ్ లో కూర్చోడానికా..? కాస్త ఫొటోలో దిగి పోస్ట్ చేయండి.. బాసూ కాస్త పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా దొరకపట్టి ఫొటోలు దిగేలా చేయండి.. ఆ ఫొటోలను షేర్ చేయండి అంటూ మెగా అభిమానులు కోరుతున్నారు.
పెళ్లి వేడుకల ఫొటోల్లో స్టార్ హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించినప్పటికీ మెగా అభిమానుల చూపులు మాత్రం పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నాయి. కానీ పవర్ స్టార్ మాత్రం ఈ ఈవెంట్లకు హాజరయ్యేలా కనిపించడం లేదు. నేరుగా ముహూర్తం టైంలో మాత్రం కనిపించి ఒక ఫ్యామిలీ ఫొటోతో సరిపెట్టేలా ఉన్నారు.
View this post on Instagram
Also Read: Varun-Lavanya Marriage: అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్యల పెళ్లి