Varahi Yatra: 'బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే'.. పవన్‌ ఏం అన్నారంటే?

బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతో కలిసి పనిచెస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. బిజెపి కలిసి వస్తుందని పవన్ చెప్పారన్నారు. మచిలీపట్నం టీడీపీ నేతలతో పవన్‌ సమావేశామయ్యారు. అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని అటు పవన్‌కళ్యాణ్‌ హాట్ కామెంట్స్ చేశారు.

New Update
Varahi Yatra: 'బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే'.. పవన్‌ ఏం అన్నారంటే?

జనసేన ఉమ్మడి కృష్ణా నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మచిలీపట్నం టీడీపీ నేతలతో. బీఎస్‌పీ 20 ఏళ్లు కష్టపడితే మాయావతి సీఎం అయ్యారని.. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలని లేడికి లేచిందే పరుగులా ఆలోచించనన్నారు పవన్‌. ఎన్టీఆర్‌కి మాత్రమే అలా సాధ్యమైందని.. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా అని ప్రశ్నించారు. వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషంలేదన్నారు పవన్‌. చిన్నప్పటి నుంచి జగన్‌ని చూస్తున్నానని.. టీనేజ్‌లో ఎస్సై ని కొట్డిన ఘటన చూశానన్నారు పవన్‌. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయిందని.. సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతాననని.. సర్వమతాలను ఆదరించే నేల మనదేనన్నారు పవన్‌.

పవన్ కళ్యాణ్ ఇంకేం అన్నారంటే?

➼ సన్నాసి అంటే తిట్టు కాదు ..ఏమి లేనివాడు అని అర్దం..

➼ వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్ లో ఆ మాట మాట్లాడను..

➼ అది కూడా మీ ప్రవర్తన బట్టి ఉంటుంది.

➼ ఈ మధ్య వైసీపిని తిట్టడంలేదు.

➼ ఎందుకంటే ఓడిపోతున్నవాళ్లని చూసి జాలిపడుతున్నా

జనసేన బలం 14శాతం - 18శాతం ఎదిగాం అని ఎనిమిది నెలల క్రితమే చెప్పారు..

➼ అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేం..

➼ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాను... సినిమాలు సమీప భవిష్యత్ లో ఆపేస్తాను..

➼ బీజేపీ క్రిస్టియన్స్ ఉండే గోవాలో ప్రభుత్వం స్దాపించంది..

➼ ప్రజలకు ఉపయోగపడితేనే, మంచి కోసమే పొత్తు ఉంటుంది

➼ ఒంటరిగా వెళితే అధికారంలో వస్తామా అనేది నాకు సందేహమే

➼ అలెయన్స్ లో వెళితే మనకి బలమైన సీట్లు వస్తాయి

➼ అసెంబ్లీ బలమైన పాదముద్ర ఉండబోతుంది

➼ జనసేన ,టీడపీ ఎదుగుతాయి , ఎవరైనా వస్తే కచ్చితంగా కలుస్తాం, ఒక్క వైసీపీ తప్ప..

publive-image
నాదెండ్ల మనోహర్ కామెంట్స్:

➼ బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రనా లీడర్లు అయిపోయాం అనుకోవద్దు

➼ నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండి..

➼ చిన్న వర్షం పడితే రాష్ట్రంలో మొదటి ఫొటో మచిలీపట్నం నుండే వచ్చేది...

➼ టీడీపీతో పొత్తుకి వెళ్లాం , రెండేళ్ల క్రితం అడుగు వేశారు.., ఇప్పటంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఆయన మన భవిష్యత్ కోసమే ఆ ‌నిర్ణయం తీసుకున్నారు..

➼ మచిలీపట్నంలో ఎవరు క్యాండెంట్ ఎవరు, ఎవరు పోటి చేస్తారు అనేది మనం తీసుకొనే నిర్ణయం కాదు పవన్ సమయం వచ్చినప్పుడు తీసుకుంటారు...

➼ అవనిగడ్డలో ఐదేళ్లుగా ఇన్చార్జ్ లేరు , కాని కార్యకర్తలతో సభ పెట్టాం , ఎవరైనా ఇలా సభ పెట్టగలరా..?

➼ సోషల్ మీడియాను మన కార్యక్రమాలు కోసం ఉపయోగించండి.. విమర్శల కోసం కాదు..

➼ పార్టీ అదేశాల‌మేరుకు మనం నిలబెట్టే అభ్యర్ది కోసం బూత్ లెవల్ లో కష్టపడాలి

➼ టీడీపీ ఏ కార్యక్రమం పెట్డిన వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి

➼ ప్రతి నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పెట్టుకున్న వాళ్లు 5 వేల నుండి 8 వేలమంది ఉన్నారు వారందరిని కదిలించండి.

publive-image
మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ ఏం అన్నారంటే?

➼ పవన్  ముందు నుంచి జగన్ అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం రావాలని స్ట్రాంగా మాట్లాడుతున్నారు

➼ చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్డినప్పుడు స్పెషల్ ఫ్లైట్ కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు

➼ రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిశాక టీడిపితో కలిసి పనిచేస్తామని చెప్పారు..

➼ బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడిపితో కలిసి పనిచెస్తామని చెప్పారు

➼ ఏ కార్యక్రమం జరిగిన కలిసి చెద్దామని చెప్పారు... ఇద్దరం కలిసి ఎదుర్కొంటాం

➼ బీజేపి జగన్ ప్రభుత్వానికి వ్యతికేరంగా ఉన్నారు

జనసేన కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం, మా కార్యక్రమాల్లో వాళ్లు పాల్గొంటారు

➼ బిజెపి కలిసి వస్తుందని పవన్ చెప్పారు

➼ పొత్తుపై బిజెపి స్పందించేంత వరకు టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎండగడతాం.

Advertisment
తాజా కథనాలు