రానున్న ఏపీ ఎన్నికల్లో (AP Elections 2023) మారోసారి విజయం సాధించి అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ అందుకు తగిన వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు ఖాయం కావడంతో కాపు ఓటర్ తమకు దూరం కాకుండా చర్యలు చేపట్టారు ఆ పార్టీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న వంగవీటి కుటుంబ సభ్యులను తమ పార్టీలో చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆమెకు సీఎం జగన్ పూనారట.. అందరి ముందు ఏం చేసిందో చూడండి..!
ఈ మేరకు ఐప్యాక్ టీం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. వంగవీటి రంగా అన్న కుమారుడు నరేంద్రకు వైసీపీ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర 2009లో పీఆర్పీ ఆవిర్భావ సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేశారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తూర్పులో దేవినేని అవినాశ్ పోటీ చేసే అవకాశం ఉండడంతో.. విజయవాడ సెంట్రల్ లో నరేంద్రను పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదని సమాచారం. ఈ మేరకు విష్ణుకు కూడా పార్టీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా తన అనుచరులతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి నరేంద్రను పోటీకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర చేరిక కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఉండొచ్చని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపీ విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ బోండా ఉమను మరో సారి బరిలోకి దించనుంది.