/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-45-jpg.webp)
Vande Bharat Restaurant: వేగానికి, సదుపాయాలకూ నిలయంగా ఉన్న వందేభారత్ ట్రైన్ థీమ్ తో టేస్ట్, లుక్ కలగలిపి నెలకొల్పిన ఓ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. గుజరాత్ లోని సూరత్ లో ఓ రెస్టారెంట్ యజమాని ఈ వినూత్న ఆలోచనను అమలు చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షించాడు. రిచ్ ఏంబియెన్స్‌తో పాటు టేస్టీ ఫుడ్ అందిస్తుండడంతో ఈ రెస్టారెంట్ కు బాగానే ఆదరణ లభిస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: సీఈసీ, ఈసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ఇక నుంచి ఆ బాధ్యత వారిదే
వందే భారత్ థీమ్డ్ రెస్టారెంట్‌లో అనేక రకాల డిష్ లు అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ పేరుకు తగ్గట్టుగానే వేగంగా సర్వ్ చేస్తూ మన్ననలు పొందుతోంది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ సగటు ధర రూ. 268 ఉండగా, డిన్నర్ కు సగటు ధర రూ. 289గా నిర్ణయించారు. ఈ రెస్టారెంట్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సరదాగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram