Hyderabad-Bengaluru Vande Bharat Express: హైదరాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్(Vande Bharat Express) ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ హైదరాబాద్(Hyderabad) - బెంగళూరు(Bengaluru) మధ్య నడవనుంది. సెప్టెంబర్ 24న ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్(బెంగళూరు) మధ్య ఈ వందేభారత్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్‌ను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇకపోతే.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్య్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy), రైల్వే ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ట్రైన్ టైమింగ్స్ ఇవీ..
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్. ఇదిలాంటే.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌తో పాటు.. ఇదే రోజున మరో 9 వందేభారత్ ట్రైన్ సర్వస్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉండటం విశేషం. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్ వరకు నడుస్తుంది. వారంలో గురువారం ఒక్క రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, ఈ ట్రైన్ ప్రతి రోజూ(గురువారం మినహా) ఉదయం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది.
తొలి కాషా రంగు వందే భారత్..
కాగా, కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారైన కాషాయ రంగు వందేభారత్ తొలి ట్రైన్‌ను కేరళ రాష్ట్రానికి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ట్రైన్ కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వయా అలెప్పి మార్గంలో నడుస్తుంది.
Also Read:
Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే..