Valentines Day Roses: వాలెంటైన్స్ డే.. గులాబీల ఎగుమతిలో రికార్డ్.. 

వాలెంటైన్స్ డే అంటే గులాబీల పండగ అని చెప్పవచ్చు. ఆ వారం అంతా గులాబీలను ఇచ్చి పుచ్చుకోవడం సాధారణ విషయం. బెంగళూరు నుంచి రికార్డ్ స్థాయిలో ఈ ఏడాది దాదాపు 3 కోట్ల గులాబీలు దేశంలోని వివిధప్రాంతాలతో పాటు.. విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇది గతేడాది కంటే 108 శాతం ఎక్కువ.

Valentines Day Roses: వాలెంటైన్స్ డే.. గులాబీల ఎగుమతిలో రికార్డ్.. 
New Update

Valentine's Day Roses: వాలెంటైన్స్ డే సందర్భంగా, అందరూ  గులాబీ పువ్వులు లేదా గులాబీ బొకే ఇచ్చి వారి ప్రేమను వ్యక్తీకరిస్తారు. వాలెంటైన్స్ వీక్ మొదలైన దగ్గర నుంచీ వాలెంటైన్స్ డే అంటే  ఫిబ్రవరి 14 వరకు గులాబీలకు మంచి డిమాండ్ ఉంటుంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ డిమాండ్ చాలా ఎక్కువ. భారతదేశంలో, ఎక్కువ శాతం గులాబీలను కర్ణాటకలో (Karnataka) పండిస్తారు. దీంతో  దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అక్కడి నుంచే గులాబీలు సప్లై అవుతాయి. ఈ ఏడాది  వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక్క బెంగళూరు విమానాశ్రయం నుంచే దాదాపు మూడు కోట్ల గులాబీలు(3 Crore Roses) రవాణా అయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది గతేడాది కంటే ఇది 108 శాతం ఎక్కువ.

గతేడాదితో పోలిస్తేభారీగా పెరిగిన డిమాండ్..
బెంగళూరు విమానాశ్రయం వెలువరించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం ప్రేమికుల రోజున 2.9 లక్షల గులాబీలు(Valentine's Day Roses) రవాణా అయ్యాయి. వాటి  మొత్తం బరువు 12,22,860 కిలోలు. గతేడాది ఈ విమానాశ్రయం నుంచి 1.54 లక్షల గులాబీలను పంపించారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 108 శాతం ఎక్కువగా గులాబీలు పంపించారు. పంపిన సుమారు మూడు కోట్ల గులాబీలలో.. రెండు కోట్ల గులాబీలను భారతీయ నగరాలకు పంపగా, 90 లక్షల గులాబీలను విదేశాలకు పంపారు.

2020లో, బెంగళూరు నుండి గులాబీ(Roses) ఎగుమతులు కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్నాయి, ఆసమయంలో  కేవలం 2.7 లక్షల కిలోలు మాత్రమే రవాణా అయ్యాయి. అయితే, 2021లో, ఎగుమతులు గణనీయంగా పుంజుకున్నాయి.  దాదాపు 5.15 లక్షల కిలోలు వివిధ గమ్యస్థానాలకు రవాణా అయ్యాయి. అలాగే 5,89,300 కిలోల గులాబీలను ఎగుమతి చేయడంతో, 2022లో ఈ ధోరణి కొనసాగింది.  14% పెరుగుదలను సాధించింది. 2023 నాటికి, బెంగళూరు గులాబీ ఎగుమతి పరిశ్రమలో రికార్డ్ వృద్ధి కనిపించింది. 

Also Read:  గోల్డ్ లవర్స్ కు భలే ఛాన్స్.. భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే..

సింగపూర్-మనీలాకు ఎక్కువగా..
బెంగళూరు గులాబీలకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం ఎక్కువ గులాబీలను(Valentines Day Roses) విదేశాలకు పంపించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 148 శాతం ఎక్కువ గులాబీలను భారతీయ నగరాలకు పంపారు. విదేశాలకు అత్యధికంగా గులాబీలు కౌలాలంపూర్, సింగపూర్, కువైట్, మనీలా, షార్జాలకు చేరాయి. దేశీయంగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, గౌహతి,  జైపూర్‌లకు వాలెంటైన్స్ డేకి ముందు బెంగళూరు నుండి గులాబీలు పంపించారు. 

Blinkitలో ప్రతి నిమిషానికి 350 రోజ్ ఆర్డర్‌లు..
అదే సమయంలో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ బ్లింక్‌ఇట్‌లో (Blinkit) ప్రతి నిమిషానికి 350 గులాబీలకు (350 Roses Per Minute) ఆర్డర్లు అందాయి. ఈ విషయాన్ని బ్లింక్‌ఇట్ యజమాని అల్బిందర్ ధింద్సా వెల్లడించారు.  ఫిబ్రవరి 9న, చాక్లెట్‌లు- గులాబీల డెలివరీ డిమాండ్‌ను రికార్డ్ స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. 

Watch this Interesting Video:

#valentines-day-2024 #valentines-day-gifts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe