Vaishnavi Chaitanya : 'బేబీ హీరోయిన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందట. ఈ విషయాన్ని హీరో ఆశిష్ అడ్డా షోలో షోలో రివీల్ చేశాడు. ఈ షోలో హీరో ఆశిష్.. వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. దీంతో అది వైష్ణవి చైతన్య పెళ్లి గురించేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Vaishnavi Chaitanya : 'బేబీ హీరోయిన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

Baby Actress Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో గత ఏడాది వచ్చిన 'బేబీ' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగమ్మాయి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి 'బేబీ' సినిమాతో హీరోయిన్ గ మారింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ముఖ్యంగా సినిమాలో వైష్ణవి చైతన్య తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. ఇక ఈ మూవీ సక్సెస్ తర్వాత ఈ హీరోయిన్ కి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందట. ఈ విషయాన్ని తన కో-యాక్టర్ హీరో ఆశిష్ ఓ షోలో రివీల్ చేశాడు.

Also Read : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!

గుడ్ న్యూస్ అదేనా?

వైష్ణవి చైతన్య రీసెంట్ గా 'లవ్ మీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా షోలో టీమ్ పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలిన్ చేశారు. ఇందులో హీరో ఆశిష్.. వైష్ణవి చైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు.

అది విన్న సుమ.. రీసెంట్ గా పెళ్లి జరిగింది నీకు, గుడ్ న్యూస్ నువ్వు చెప్పాలి కదా అంటూ సెటైర్ వేసింది. దీంతో వైష్ణవి చైతన్య దగ్గర నుంచి గుడ్ న్యూస్ అంటే ఆమె పెళ్లి మాత్రమే కాబట్టి, త్వరలోనే ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందేమో అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు