Vaishnavi Chaitanya: మొన్నటివరకు ఫ్రీ.. ఒక్కసారిగా బిజీ

జూలైలో విడుదలైన బేబీ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా యూత్ ను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా వైష్ణవి చైతన్య, తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ వెంటనే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. ఎట్టకేలకు ఆమెకు సరైన అవకాశాలు వస్తున్నాయి.

New Update
Vaishnavi Chaitanya: మొన్నటివరకు ఫ్రీ.. ఒక్కసారిగా బిజీ

Vaishnavi Chaitanya: బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవి చైతన్యకి ఇతర హీరోయిన్లలా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె బిజీ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు శిరీష్‌కి జోడీగా కూడా కొత్త చిత్రంలో నటించనుందని సమాచారం.

జూలైలో విడుదలైన బేబీ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా యూత్ ను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా వైష్ణవి చైతన్య, తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ వెంటనే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. ఎట్టకేలకు ఆమెకు సరైన అవకాశాలు వస్తున్నాయి.డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమా, సిద్ధు జొన్నలగడ్డను స్టార్ ని చేసింది. ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్' సీక్వెల్ రెడీ చేస్తున్న ఆయన దర్శకురాలు నందిని రెడ్డితో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా, బొమ్మరిల్లు భాస్కర్‌తో మరో చిత్రానికి పూజా కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాడు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో వైష్ణవి చైతన్య నటించనుంది.

publive-image

బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. సో.. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా వైష్ణవికి మంచి రోల్ దక్కి ఉంటుంది. ఆమె కెరీర్‌లో ఈ సినిమా మరో మలుపు అవుతుందని అంటున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

publive-image

ఈ సినిమాతో పాటు అల్లు శిరీష్ హీరోగా రాబోతున్న ఓ సినిమాలో కూడా వైష్ణవి చైతన్యను తీసుకునేందుకు చర్చలు సాగుతున్నాయి. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. బన్నీ వాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో వైష్ణవి దాదాపు లాక్ అయినట్టు తెలుస్తోంది.

Also Read: ఈ ఇండస్ట్రీకి ఏమైంది.. ఎవ్వరూ మాట్లాడరేంటి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు