Adikesava: మెగా హీరో సినిమా వాయిదా..కారణం ఇదే..! వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ 'ఆదికేశవ'. నవంబర్ 10న విడుదల కావాల్సిన ఈ మూవీకి స్మాల్ బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపథ్యంలో 'ఆదికేశవ' సినిమాని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. By Jyoshna Sappogula 01 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 'Adikesava' postponed to 24th November: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి ఆదరణను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, “ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా.. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం మేం గమనించాం. పైగా ఇప్పుడు సెమీ ఫైనల్స్ వస్తున్నాయి. ఇండియా ఫైనల్ కి వెళ్ళి, వరల్డ్ కప్ గెలుస్తుందనే అంచనాలు అందరిలో ఉన్నాయి. అందుకే ఈ సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది” అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్, మాస్ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు. ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. #sreeleela #adikesava-movie #mega-hero-vaishnav-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి