Coolest Places in India: ఎండ వేడిమికి అందరి పరిస్థితి ఘోరంగా తయారైంది. అయితే సమ్మర్ లో వేడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఇక్కడికి మే-జూన్ నెలల్లో వెళ్లడం కూడా కష్టంగా ఉంటుంది. అంత చల్లగా ఉంటాయి ఈ ప్రదేశాలు. భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సమ్మర్ లో ఈ ప్రదేశాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు.
కార్గిల్, జమ్మూ కాశ్మీర్
భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో కార్గిల్ నగరం ఒకటి. ఇది సురు నది ఒడ్డున 2,676 మీటర్ల ఎత్తులో ఉంది. కార్గిల్‌కు సమీపంలో, 15 కి.మీ.ల దూరంలో, పష్కుమ్ అని పిలువబడే కొండలపై రాజభవనాల శిధిలాల చారిత్రక పట్టణం. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత 48 డిగ్రీలు ఉంటుంది.
లేహ్ లడఖ్
లడఖ్ రాజధాని, లేహ్ (Ladakh-Leh) చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది వేసవిలో సందర్శించడానికి గొప్ప ప్రదేశం, ఇక్కడ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్, పాంగోంగ్ లేక్, అనేక ఇతర సరస్సులు, మఠాలు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు.
ఉత్తర సిక్కిం
ఉత్తర సిక్కిం ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. జీరో పాయింట్, యుమ్తాంగ్ వ్యాలీ, లాచుంగ్ మొనాస్టరీ, క్రోజ్ సరస్సు ఇక్కడ చూడదగ్గవి. వేసవి సెలవుల్లో షికారు చేయడానికి ఇక్కడకు వెళ్లవచ్చు.
సెలా పాస్, తవాంగ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఉన్న సెలా పాస్ చాలా చల్లని ప్రదేశం. ఇది బౌద్ధ నగరమైన తవాంగ్‌ను తేజ్‌పూర్, గౌహతితో కలుస్తుంది. ఈ ప్రదేశం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది, ఇది ప్రకృతి ప్రేమికులకు మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: Ash Gourd: గుమ్మడికాయకు ఇంత శక్తి ఉందా.. ఆరోగ్యానికి ఇది ఒక వరం..!