ఉత్తరాఖండ్‎లో ఘోరప్రమాదం, లోయలో పడిన జీప్, 9మంది దుర్మరణం..!!

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్‎గఢ్‎లో జీపు 600 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. హోక్రా ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీపులో మొత్తం పదిమంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‎లో ఘోరప్రమాదం, లోయలో పడిన జీప్, 9మంది దుర్మరణం..!!
New Update

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పితోర్‌గఢ్ జిల్లా మున్సియరీ బ్లాక్‌లోని బాగేశ్వర్‌లోని సామా నుంచి హోక్రా ఆలయానికి వెళ్తున్న జీపు రోడ్డుపై నుంచి అదుపుతప్పి రామగంగా నదిలో పడిపోయింది. వాహనంలో ఉన్న పది మందిలో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అటుగా వెళ్తున్న ఇతర డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇతర డ్రైవర్ల సమాచారంతో పోలీసులతోపాటు రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జీప్ 600 మీటర్ల కంటే ఎక్కువ లోతైన లోయలో పడటంతో సహాయక చర్యలు చాలా ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

uttarakhand accident

ఈ ఘోర ప్రమాదంపై ఎమ్మెల్యే హరీష్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా మెజిస్ట్రేట్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి..సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంపై ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు పరిహారం అందజేలా చూస్తామని తెలిపారు. అటు పితోర్‌గఢ్‌లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ధామి ఆకాంక్షించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe