Viral : ఆన్‌లైన్‌లో బర్రెను ఆర్డర్...ఆ తర్వాత ఏం జరిగిందో తెలుస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

యూపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్లో బర్రెన్ ఆర్డర్ చేశాడు. అడ్వాన్స్ చెల్లించాడు. ఆర్డర్ రాలేదు. బర్రెను విక్రయిస్తున్న వ్యాపారికి ఫోన్ చేశాడు. బర్రెను డెలివరీ చేయలేదని.. మరో 25వేలు పంపించమని ఆ వ్యాపారి అడనంతో ఫ్రాడ్ అని గుర్తించి సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Viral : ఆన్‌లైన్‌లో బర్రెను ఆర్డర్...ఆ తర్వాత ఏం జరిగిందో తెలుస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

Buffalo Fraud :  ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం కామన్ అయ్యింది. ఆర్డర్ సమయానికి రాకుంటే హెల్ప్ లైన్ కు కాల్ చేసి వాకబు చేస్తుంటారు. ఇదొక్కటి ఆప్షన్ ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ పాల వ్యాపారి పరిస్థితి చేతులకు అందకుండా పోయింది. ఆ పాల వ్యాపారి ఆన్ లైన్ లో బర్రెను ఆర్డర్ పెట్టాడు.రాయ్ బరేలీకి చెందిన రైతు సునీన్ యూట్యూబ్ లో ఓ వీడియోను చూసి బర్రెన్ ఆర్డర్ చేశాడు. ఆ బర్రెను కొనుగోలు చేయాలనుకున్నాడు.

ఆ వీడియో కింద ప్రస్తావించిన నెంబర్ కు ఫోన్ చేశాడు. అటు వైపు నుంచి జైపూర్ కు చెందిన ఓ వ్యాపారి శుభమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ బర్రె మంచి బ్రీడ్ అని రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తుందన్నాడు. బర్రె వీడియోను సునీల్ కు పంపించాడు. ఆ బర్రెకు ఖరీదు 55వేలని చెప్పాడు. బర్రెకు డిమాండ్ ఎక్కువగా ఉందని ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని చెప్పాడు. దీంతో సునీల్ 10వేలు ఆ వ్యాపారికి పంపించాడు.

కానీ రోజులు గడుస్తున్నా అనుకున్న సమయానికి బర్రె రాలేదు. సునీల్ ఆ వ్యాపారికి ఫోన్ చేశాడు. బర్రెను ఇంకా డెలివరీ చేయలేదని మరో రూ. 25వేలు చెల్లించాలన్నాడు. దీంతో సునీల్ అనుమానం వచ్చింది. ఇదంతా ఫ్రాడ్ అనే అభిప్రాయానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్ తన నెంబర్ ను ఆ వ్యాపారి బ్లాక్ లిస్టులో పెట్టాడని చెప్పాడు.

ఇది కూడా చదవండి : రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

Advertisment
తాజా కథనాలు