తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే సిలిండర్ ఎప్పటినుంచంటే

తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్యాస్‌ సిలిండర్‌ హామీ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. అలాగే కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.

New Update
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే సిలిండర్ ఎప్పటినుంచంటే

Good News For Telangana People : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రులు అధికారులకు పలు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పని తీరును సమీక్షించిన ఆయన.. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, గిడ్డంగుల నిర్వహణ, రేషన్ వస్తువుల సరఫరా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖగా పేర్కొన్నారు. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ ఇదేనని చెప్పారు. అలాగే తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే మొదలు పెట్టిందని, త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్వాలిటీ రేషన్ సప్లై 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బిఆర్ఎస్ ఉచితంగా ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయింది. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలనేది మా తపన. దీనిపై కమిషనర్ మళ్ళీ సమీక్ష చేయాలి. మొత్తం రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్ కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక గత ప్రభుత్వం ఈ శాఖకు ఆర్థికంగా సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు మిగిలిందన్నారు.

ఇది కూడా చదవండి : అనన్యతో డేటింగ్‌పై ఆదిత్య షాకింగ్ కామెంట్స్.. ఆ విషయం అడగొద్దంటూ

ఇక సివిల్ సప్లై కార్పొరేషన్ 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పిత్తి కాగా 18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్దే ఉందని చెప్పారు. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు. అలాగే 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందన్న ఆయన.. తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. చివరగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని  ఆయన హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు