ఎట్టకేలకు నెరవేరిన ఉత్తమ్ కల.. షేవింగ్ ముహూర్తం ఫిక్స్

కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. 2018 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గడ్డం తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుండగా ఇన్నాళ్లకు తన మొక్కు తీరబోతుందని చెప్పారు.

ఎట్టకేలకు నెరవేరిన ఉత్తమ్ కల.. షేవింగ్ ముహూర్తం ఫిక్స్
New Update

కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ నెరవేరే రోజు రానే వచ్చింది. తెలంగాణ ఏర్పడినప్పటనుంచి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన.. 2018లో ఎన్నికల్లో భాగంగా గడ్డం పెంచుకున్న విషయం తెలిసిందే. కాగా అప్పనుంచి ఉత్తమ్ గడ్డం ఇష్యూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ గెలిస్తే తన గడ్డం తీసుకుంటానని ఉత్తమ్ ప్రకటించగా 2018లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఉత్తమ్ కుమార్ గడ్డంపై బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు ఎగతాళి చేశారు. గడ్డం తీసుకోకపోతే గుడ్డేలుగులా ఉన్నాడని, తమకేమీ ఇబ్బందిలేదన్నారు.

Also read :ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం

అయితే 2023 ఎన్నికల సందర్భంగా ఈ గడ్డం వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తన షేవింగ్ పై సంచలన ప్రకటన చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ప్రతిజ్ఞ నెరవేరే రోజు వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను గడ్డం తీసుకుంటానని గతంలో చేసిన ప్రతిజ్ఞను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. నా మొక్కు తీరబోతుంది. కాంగ్రెస్ గెలుపు ఖరారు కాగానే క్లీన్ సేవ్ చేసుకుంటా'అని చెప్పారు. గతంలో చాలా స్మార్ట్ గా కనిపించే ఉత్తమ్ మరోసారి అదే లుక్ లో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుండగా హుజుర్ నగర్ నుంచి పోటీచేసిన ఉత్తమ్ కుమార్ 47 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. నవంబర్ 9వ తేదీన వారంతా హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

#telangana-elections-2023 #uttam-kumar-reddy #telangana-election-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe