Ear Phones: అదే పనిగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా? జరిగేది ఇదే..!

అదే పనిగా ఇయర్‌ఫోన్స్ వాడడం వల్ల మీరు వినికిడి శక్తిని కోల్పోతారు. అంతేకాదు ఇది మీ చెవి ఇన్ఫెక్షన్‌లకు దారితీయవచ్చు. హై వాల్యూమ్‌లో ఉపయోగించడం వల్ల చెవి నొప్పి పుడుతుంది. హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లు లాంటి మీ ఆడియో పరికరాల వాల్యూమ్‌ను 85 dB కంటే తక్కువ స్థాయిలో ఉండాలని గుర్తు పెట్టుకోండి.

New Update
Ear Phones: అదే పనిగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా? జరిగేది ఇదే..!

పాటలు ఆస్వాదించడానికైనా.. ఇతురులు చెప్పే మాటలు వినడానికికైనా చాలా మంది ఇయర్ ఫోన్స్‌ని యూజ్ చేస్తుంటారు. రోడ్డుపై వెళ్తు, బైక్‌ డ్రైవ్‌ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌లో కాల్స్‌ లేదా పాటలు వినే వారి సంఖ్య పెరుగుతోంది. అటు నైట్‌ టైమ్‌లో కొంతమంది ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. సాంగ్స్‌ ఆఫ్ చేయరు. మరికొంతమంది రోజులో చాలా సేవు వాటితోనే గడుపుతుంటారు. పైన చెప్పినవన్ని మీకు హానికరం. మీ చెవికి ఇవి చేటు చేస్తాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వినికిడి నష్టం: ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్‌లను హై వాల్యూమ్‌లో ఉపయోగించడం వల్ల కాలక్రమేణా వినికిడి లోపం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వాల్యూమ్‌ను 80dB కంటే తక్కువ స్థాయిలో ఉంచడం చాలా అవసరం.

ఎక్కువ గంటలు ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోని ఉండడం వల్ల మీ చెవులు చుట్టుపక్కల ప్రాంతాలలో అసౌకర్యం కలుగుతుంది. ఇది నొప్పిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఇయర్‌బడ్స్ మన చెవుల వద్ద సున్నితమైన భాగాలను ప్రెస్ చేస్తుంది.

ఇన్ఫెక్షన్‌లు: ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్‌ ఉపయోగించడం వల్ల మీ చెవి ఇన్ఫెక్షన్‌లకు దారితీయవచ్చు.

టిన్నిటస్: ఇయర్‌ఫోన్‌ల సౌండ్‌ పెంచి ఎక్కువ సేపు వినడం వల్ల మీ చెవుల్లో రింగింగ్‌ సౌండ్‌ వినిపిస్తుందా? ఇయర్‌ ఫోన్స్ వాడనప్పుడు కూడా అలానే అనిపిస్తే దాన్నే టిన్నిటస్ అంటారు.

ఐసోలేషన్: మితిమీరిన ఇయర్‌ఫోన్‌ల వాడకం మిమ్మల్ని సామాజానికి దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఇయర్‌ఫోన్స్ పెట్టుకోనే వారితో చాలా మంది మాట్లాడడానికి ఇష్టపడరని అధ్యయనలు చెబుతున్నాయి. డిస్టర్బ్‌ చేయకూడదనుకునే సంకేతంగా ఇతరులు దీన్ని భావిస్తారు.

ఇయర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డుపై వెళ్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి.

మానవ వినికిడి పరిధి సాధారణంగా కనిష్టంగా 20Hz నుంచి గరిష్టంగా 20,000Hz వరకు ఉంటుంది. ఇది ఒక పర్సెన్‌ నుంచి మరో పర్సెన్‌కి వేరుగా ఉంటుంది. 1,000 Hz వద్ద 0 డెసిబెల్స్ (dB) ఉంటుంది. ధ్వని తీవ్రత పెరిగేకొద్దీ దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. మీ వినికిడిని రక్షించడం కోసం హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లు లాంటి మీ ఆడియో పరికరాల వాల్యూమ్‌ను 85 dB కంటే తక్కువ స్థాయిలో ఉండాలని గుర్తు పెట్టుకోండి. 85 dB కంటే ఎక్కువ సౌండ్‌ని ఎక్కువసేపు వింటే మీరు వినికిడి శక్తి కోల్పోతారు.

Also Read: వీటి గురించి మీ లవర్‌ దగ్గర అసలు మాట్లాడొద్దు.. లేనిపోని గొడవలు తప్పవు!

Advertisment
Advertisment
తాజా కథనాలు