‘ఓరేయ్ కూల్‌డ్రింక్స్ తీసుకురా..’ ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే అమ్మా,నాన్న పిల్లలకు చెప్పే పని ఇదే..! ఇంటికొచ్చే గెస్టులను మర్యాద చేయడం నుంచి మాంసం ముద్ద దిగే వరకు కూల్‌డ్రింక్ వాడకం సర్వసాధరణమైపోయింది. తిన్నది అరగడానికన్న సాకుతో మాంసం కంటే ఈ కూల్‌డ్రింకుల గ్రాసులే ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే అలా అరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పే ప్రభుత్వాలు కూడా కూల్‌డ్రింక్స్ విషయంలో మెతక వైఖరినే అవలంభిస్తుంటాయి. కొంతమంది సినీ సెలబ్రెటీలు సైతం కూల్‌డ్రింక్స్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లగా వ్యవహరిస్తుంటారు. అంతలా నార్మలైజ్ ఐపోయిన కూల్‌డ్రింక్స్ క్యాన్సర్‌కు కారణమని తెలుసా..? గుండెజబ్బులు రావడానికి కూడా కారణమవుతున్నాయని తెలుసా..? ఇది ఎవరో చెప్పిన విషయాలు కావు.. సాక్ష్యత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధ్యయనంలో తేలిన నిజాలు..!
పూర్తిగా చదవండి..Cooldrinks: కూల్ డ్రింక్స్‌తో క్యాన్సర్, గుండె జబ్బులు! బ్యాన్ చేస్తారా..?
కూల్‌డ్రింక్స్‌తో పాటు చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్‌క్రీమ్, పెరుగు లాంటి పాల ఉత్పత్తులు, టూత్ పేస్ట్, దగ్గు మందుల్లో ఉండే ఆస్పర్టేమ్ క్యాన్సర్‌కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. కార్సినో జెనిసిటికి' కారణంగా ఉదహరిస్తూ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది.
Translate this News: