Tomato Benefits: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్‌ ఏ మాత్రం తగ్గదు

ప్రతీ వంటలో టమాటా కావాల్సిందే. రుచితో పాటు గ్రేవీ కావలంటే టమాటాలు వేస్తాయి. వీటికి బదులు రెడ్ క్యాప్సికమ్స్, సొరకాయ వంటి వెజిటేబుల్స్‌, చింతపండు, ఉసిరి, పెరుగు వంటి వాడుకుంటే వేసుకుంటే సేమ్ టమాటా వేసుకున్న టేస్టే వస్తుంది.

New Update
Tomato Benefits: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్‌ ఏ మాత్రం తగ్గదు

Vegetable Benefits:  మనం ఏ వంట చేసినా అందులో టమోటా(Tomato) కచ్చితంగా ఉండాల్సిందే. టమోటా లేనిదే కూరలో టేస్ట్ రాదు. గ్రేవీ కావాలన్నా టమోటా అవసరం. టమోటా దొరకని సందర్భంలో కొన్ని ప్రత్యామ్నాయ కూరగాయలను కూడా వాడొచ్చు. అవి వేసుకుంటే టమోటా వేసిన రుచి వస్తుంది. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వెజిటేబుల్స్‌ వాడితే టేస్ట్ సూపర్

రెడ్ క్యాప్సికం (Red Capsicum): టమోటాకు ఈ పండును మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఈ క్యాప్సికంలో అనేక రకాల రంగులు ఉంటాయి. ఏది వాడినా టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. కాకపోతే వీటిని ఎక్కువగా వాడడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన మెటబాలిజం రేటును పెంచుతుంది. ఈ క్యాప్సికం అప్పుడప్పుడు వాడడం వల్ల టమోటా లేని లోటును భర్తీ చేసుకోవచ్చు.
పెరుగు: పెరుగు కూడా కూరల్లో వేసుకొని వాడుకోవచ్చు. మాంసాహారంలో పెరుగు వేసుకోవడంతో మంచి రుచి, ఆ కూర చిక్కగా వస్తుంది. కొన్ని కూరల్లో వేసుకోవడం వల్ల టమోటా లేని లోటును భర్తీ చేస్తుంది. అలాగే మామిడి కాయలు కూడా కూరల్లో వేసుకోవచ్చు. మార్కెట్లో ఆమ్‌చూర్‌ పౌడర్ దొరుకుతుంది. దీన్ని కూడా కూరల్లో వేసుకోవచ్చు.

సొరకాయ: మన పెరట్లో ఎక్కువగా ఇది పండుతుంది. సొరకాయతో పాటు టమోటా ఉంటేనే కూరలో రుచి అంటారు. కాకపోతే టమాటా లేకుండా ఉండాలంటే చింతపండు, ఉసిరి కలిపి వండుకోవచ్చు. సొరకాయ పప్పులో చింతపండు కలిపి వండుకుంటే ఆ రుచే వేరు.
చింతపండు: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో చింతపండు ఉంటుంది. ఒక మోతాదులో దీని కూరల్లో వాడుకోవడం వల్ల పుల్లదనం.. ఆ కూరకు రుచి వస్తుంది.
ఉసిరి: సాధారణంగా ఉల్లి చేసే మేలు అనే సామెత గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఉసిరి కూడా మేలు చేస్తానని చెబుతోంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఉసిరిని ఇండియన్ గ్రీన్ టమోటోస్ అని పిలుస్తారు. టమోటాకి ఏ మాత్రం తగ్గకుండా ఉసిరి కూడా వగరు, పులుపుతో టమోటా టేస్ట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఉసిరి తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. మన కాలయాన్ని ఇది కాపాడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థకు కూడా మంచిది - Kitchen Tips

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ సూప్‌లు ట్రై చేయండి..ఎన్నో ప్రయోజనాలు

Advertisment
తాజా కథనాలు