Tea Leaves Tips: మెరిసే, అందమైన ముఖం కావాలంటే ఈ టీ ఆకులను ఉపయోగించండి. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రతీ ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని క్రీములు వాడినా.. ఏ ఇంటి చిట్కాలు ప్రయత్నించినా ఉపశమనం లభించదు. మచ్చల వల్ల ఇబ్బంది ఉంటే వాటిని వదిలించుకోవాలనుకునేవారికి టీ ఆకుల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించి ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. టీ ఆకులు, టీ రుచిని పెంపొందించడంతో పాటు.. ముఖ కాంతిని పెంచడంలో కూడా ఎంతగానో సహకరిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. టీ ఆకులను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. వాటిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
టీ ఆకులతో ఫేస్ ప్యాక్:
- టీ ఆకుల నుంచి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఉపయోగించిన టీ ఆకులను 1 టీస్పూన్ పెరుగు, తేనెతో కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి 15 నిమిషాలు అప్లై చేసి, ఆపై ముఖం కడుక్కోవాలి. జిడ్డు చర్మం ఉన్నట్లయితే.. టీ లీఫ్ పౌడర్‌ను తయారు చేసి, శెనగపిండి, నిమ్మరసం కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి 10 నిమిషాలు పట్టించి, ఆపై శుభ్రం చేసుకోవాలి.
- మొటిమలను తొలగించడానికి.. టీ ఆకులను ఒక కప్పు నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ నీటితో ముఖం కడగాలి. అంతే కాకుండా చల్లని టీ ఆకులను కళ్ల కింద అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.
- టీ ఆకుల నుంచి టోనర్ తయారు చేయవచ్చు. దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక చెంచా టీ ఆకులను వేసి 5 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత ఈ నీరు చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపి టోనర్‌గా ఉపయోగించాలి. వీటన్నింటిని ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. ఇది జరిగితే డాక్టర్ సలహా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చదవండి: మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా..? ఇలా ఉపశమనం పొందండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.