America: భారత్‌ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు...తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు!

భారత్‌ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్‌, జమ్మూ, కశ్మీర్, భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది.

America: భారత్‌ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు...తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు!
New Update

America: భారత్‌ లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా పలు కీలక సూచనలు చేసింది. మణిపూర్‌, జమ్మూ, కశ్మీర్, భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దులతో పాటు మావోయిస్టులుగా ఉన్న దేశ మధ్య- తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణం పై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది.

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని వివరించింది. భారత్‌- పాక్‌ సరిహద్దులోని 10 కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది. అలాగే తూర్పు లద్దాఖ్‌ , లేహ్‌ మినహా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ లోనూ పర్యటించొద్దని తెలిపింది.

ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన పై పునరాలోచించాలని తెలిపింది. భారత్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని పేర్కొంది. ఉగ్రవాదులు ఎక్కువగా పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ సంస్థలనే లక్ష్యంగా చేసుకుంటారని అమెరికా పేర్కొంది.

Also Read: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు!

#bharat #america #alert
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe