US: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు! అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారు అయ్యింది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించాడు.వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ. By Bhavana 16 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Usha Chilukuri Vance: అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో..రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు అధికారికంగా ఓకే అయిన సంగతి తెలిసిందే. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేశారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (JD Vance) పేరును ట్రంప్ ప్రకటించాడు. 39ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చిన వాన్స్.. చివరకు ట్రంప్ విధేయుడిగా మారాడు. దీంతో ట్రంప్ అతన్ని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలిపారు. ఇంతకీ ఈ వాన్స్ ఎవరో కాదు..మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా చేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో వివేక్ రామస్వామి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జేడీ వాన్స్ పేరును ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అతడో గొప్ప ఉపాధ్యక్షుడు అవుతాడని ప్రశంసించారు. Also read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్ తో భేటీ! #bharat #america #vans #usha-chhilukuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి