Joe Biden: బైడెన్‌ కు కరోనా పాజిటివ్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు కోవిడ్ పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ప్రకటన విడుదల చేసింది. బైడెన్‌ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్‌ హౌస్‌ అధికారులు వివరించారు. బైడెన్‌ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు

New Update
Joe Biden: బైడెన్‌ కు కరోనా పాజిటివ్‌!

Joe Biden tests positive for Covid-19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు కోవిడ్ పాజిటివ్‌ గా తేలింది. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ప్రకటన విడుదల చేసింది. బైడెన్‌ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్‌ హౌస్‌ అధికారులు వివరించారు. బైడెన్‌ డెలావేర్‌ లోని సముద్ర తీరంలో ఉన్న ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారం ఉన్న బైడెన్‌ కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అవ్వడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు మీడియాకు వివరించారు.మంగళవారం బైడెన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలిగేందుకు ఆలోచిస్తానని వివరించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

Also Read: రీల్స్‌ చేస్తుండగా ప్రమాదం..లోయలోపడి ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు