ఉత్తరప్రదేశ్‌లో మరో అవమానవీయ ఘటన.. గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన

దేశంలో ఇటీవల దళితులపై అవమానవీయ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన సంఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి దారుణ ఘటనే జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో మరో అవమానవీయ ఘటన.. గిరిజనుడి చెవిలో మూత్రవిసర్జన
New Update

publive-image

గిరిజనుడి చెవిలో మూత్రం పోసిన వ్యక్తి.. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తాగిన మత్తులో దళితుడి చెవిలో మూత్ర విసర్జన చేశాడు. ఈ అవమానవీయ సంఘటన ఆ రాష్ట్రంలో అలజడి రేపింది. ఓబరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గటిహట్ గ్రామానికి చెందిన జవహీర్ పటేల్, గులాబ్ కోర్ అనే ఇద్దరు వ్యక్తులు జులై 11వ తేదీ రాత్రి కలిసి మద్యం తాగారు. తాగిన మత్తులో వీరిద్దరి మధ్య ఏదో విషయంలో ఘర్షణ తలెత్తింది. దీంతో కోపంతో జవహర్.. గులాబ్‌ను బూతులు తిడుతూ అతడి చెవిలో మూత్రం పోశాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

publive-image

మద్యం మత్తులో గుర్తించని బాధితుడు.. 

ఈ ఘటన వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో బాధితుడు గుర్తించేలేకపోయాడని తెలిపారు. వీడియో చూసిన అనంతరం తనకు జరిగిన అవమానంపై బాధితుడు ఫిర్యాదుతో జవహర్‌పై కేసు నమోదుచేశామని సోన్‌భద్ర ఎస్పీ యశ్వీర్ సింగ్ తెలిపారు.

publive-image

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ ఘటన.. 

ఇటీవల మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ చర్యను ఖండించండంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం తన ఇంటికి గిరిజన వ్యక్తిని పిలిపించుకుని అతడి కాళ్లను కడిగారు. ఆదివాసీలపై దౌర్జన్యాలకు బీజేపీ అనుమతిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీలో ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న ప్రవేశ్ శుక్లా బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనపడిందని పేర్కొంది. అయితే కాంగ్రెస్ ఆరోపణలు బీజేపీ ఖండించింది. నిందితుడికి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా శుక్లా ఇంటిని జేసీబీలతో కూల్చివేయించింది.

గిరిజనులపై ఆగని అఘాయిత్యాలు..

ఈ ఘటనకు సంబంధించిన రాజకీయ దుమారం జరగుతుండగానే ఇద్దరు గిరిజన యువకులపై కొంతమంది వ్యక్తులు క్రూరంగా దాడి చేసిన వీడియో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఇండోర్‌లోని రౌ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గిరిజన సోదరులు నడుపుతున్న బైక్ కిందపడింది. అయితే అక్కడ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఇద్దరిని రూంకు తీసుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విమర్శలు చౌహాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe