మానవ మేధస్సును వినియోగించుకుంటే ఎన్నో అవకాశాలను సాధించవచ్చని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం అనేది నానాడి మాట.కాని నేడు మగవారి కన్నా అత్యుత్తమ హోదా లో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. అలాంటి సక్సెస్ స్టోరీ యే ఐపీఎస్ ఆఫీసర్ అనన్యసింగ్ కథ.
ఇండియన్ పీనల్ కోడ్(INDIAN PENAL CODE) లో చేరాలంటే అంత ఈజీ ఏం కాదు.కాని ప్రయత్నించిన ఏడాదిలోపే ఈ పరీక్షలో ఉతీర్ణులైనవారు చాలా తక్కువమంది ఉంటారు. ఆ తక్కువ మంది ప్రతిభావంతులలో ఒకరైన వారే అనన్య సింగ్ . ఈ మె యూపీఎస్సీ సివిల్స్(UPSC SIVILES) ఫలితాలలో ప్రయత్నించిన మొదటి సారే జాతీయ స్థాయిలో 51 వ ర్యాంకును సాధించించి ఐపీఎస్(IPS) కొట్టారు.
ఉత్తర ప్రదేశ్(UTTHAR PRADESH) ప్రయాగ్ రాజ్ కు చెందిన అనన్యసింగ్ కు బాల్యం నుంచి చదువు పై ఆసక్తి ఉండేది. స్థానిక సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాలలో విద్యాబ్యాసం పూర్తి చేసింది. ఆమె తన మేధస్సును మెరుగుపరుచుకుంటు ముందుకు సాగారు.10,12 తరగతులలో CISE జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచింది.10 వతరగతిలో 96 శాతం తో 12 వతరగతిలో 98.25%శాతం సాధించి టాపర్ గా నిలిచారు. ఆ తర్వాత ఢిల్లీ లోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో గ్రాడ్యుయేట్ ను పూర్తి చేశారు.
అనన్యసింగ్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన ఒక సంవత్సరం తర్వాత,2019లో ఆమె కేవలం 22 సంవత్సరాల వయస్సులో మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ లో జాతీయ స్థాయిలో 51వర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ప్రతి రోజు 7-8 గంటల సమయాన్ని చదువుకే కేటాయించేవారు. చాలా మంది యూపీఎస్సీ ను సాధించాలనే ప్రయత్నించే వారు ఆమె విజయ సాధన తెలుసుకోవాలన్నది వారి కోరిక. ఆమె వృత్తి పరమైన ప్రశంసలకు అనన్య జీవిత కథ సోషల్ మీడియా కు విస్తరించింది. ప్రస్తుతం ఆమ ఇన్ స్టాగ్రామ్‌లో 43.5K ఫాలోవర్స్ ఉన్నారు.