/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-6-11.jpg)
IAS-IPS: మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్.. సివిల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగురాలిగా ఫేక్ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగం పొందిన్న వార్తలు సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఆమెతోపాటు మరికొంతమంది అభ్యర్థులు నకిలీ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ చూపించినట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా ఐఏఎస్-ఐపీఎస్ అధికారులపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన అధికారులు, ఇందుకు సంబంధించి ప్రూఫ్స్ ఇవే అంటూ కొన్ని ఫొటోలు, వీడియలోను షేర్ చేస్తున్నారు. ఇందులో కొంత మంది మాత్రం వారిపై వస్తున్న ఆరోపణలపై పలు మీడియా సంస్థల ద్వారా.. సోషల్ మీడియా ఖాతాల ద్వారా వివరణ ఇస్తున్నారు.
అను బెనివాల్:
ఢిల్లీలోని పితంపుర నివాసి అను బెనివాల్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. UPSC ఫలితాల్లో EWS విభాగం నుంచి 217వ ర్యాంక్ పొందారు అను. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటోంది. అయితే గత కొన్ని రోజులుగా అను ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఫొటోలో బోర్డుపై 1989 బ్యాచ్ ఐపీఎస్‌ల పేర్లు రాసి ఉండగా తండ్రి పేరు ఐపీఎస్ సంజయ్ బేనివాల్ అని ఉండటంతో రిటైర్డ్ ఐపిఎస్ కుమార్తె EWS కింద ఎలా ఎంపికైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో రాజస్థాన్‌లోని ఓబీసీ కేటగిరీ ఐపీఎస్ అధికారి అయిన బెనివాల్ తన తండ్రి కాదని అను తెలిపారు.
राजस्थान में OBC केटेगरी के IPS अधिकारी संजय बेनीवाल की पुत्री अनु बेनीवाल को EWS कोटे से IPS बनने पर हार्दिक बधाई एवं शुभकामनायें..
EWS आरक्षण का मजाक बनाकर रख दिया है..#EWS_Demands_Equalitypic.twitter.com/ZxgNIOVvSf
— Ajay Tiwari Bassi (@AjayTiwariBassi) July 14, 2024
'రిటైర్డ్ ఐపిఎస్ సంజయ్ బెనివాల్ పితాంపుర నుంచి ఐపిఎస్ అయిన మొదటి వ్యక్తి. నేను అతని ద్వారా చాలా ప్రేరణ పొందాను. అతను నా తండ్రి కాదు. నేను అతన్ని ప్రేమగా తౌ జీ అని పిలుస్తాను. మా నాన్న చాలా సంవత్సరాల క్రితం ఓ ఫ్యాక్టరీని స్థాపించారు. కానీ అనారోగ్య కారణాల వల్ల దానిని నడపలేకపోయారు. మా నాన్న పేరు మీద భూమి లేదు. మా మేనమామ మమ్మల్ని పెంచాడు'అని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత జూలై 14, 2024న ఎక్స్‌లో తన తల్లిదండ్రులతో ఉన్న చిత్రాన్ని అను పోస్ట్ చేశారు. తన తల్లిదండ్రులు పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయినప్పటికీ వారి కలలను నెరవేర్చుకునేందుకు పిల్లలను ప్రేరేపించినందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు.
ప్రఫుల్ల దేశాయ్:
ప్రఫుల్ల దేశాయ్ UPSC ఫలితాల ప్రకారం 2019 సంవత్సరంలో 532వ ర్యాంక్ సాధించారు. ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద ఎంపికయ్యారన్న వార్తలు సోసల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దేశాయ్ బయోడేటాకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో తను ట్రెక్కింగ్ చేస్తూ కనిపించడం అనేక అనుమానాలకు దారితీసింది. దీంతో ప్రఫుల్ల ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆర్థోపెడికల్ వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
आप 2019 बैच के #532वी रैंक के साथ IAS बने प्रफुल देशाई हैं। आप जब ट्रैनिंग के लिए LBSNAA गए तो आपने जाते ही 25KM ट्रैकिंग की और 30KM साइक्लिंग की।
जबकि आप ऑर्थोपेडिकल हैंडिकैप्ड है। आपने ट्रेनिंग के दौरान ऐसा क्या खा लिया कि आप एकदम पहाड़ चढ़ने लगे? #UPSCscampic.twitter.com/GA0PkXVNpN
— Mukesh Mohan (@MukeshMohannn) July 16, 2024
ఈ మేరకు 2019 బ్యాచ్‌లో 532వ ర్యాంక్‌తో IAS అయిన ప్రఫుల్ల దేశాయ్.. శిక్షణ కోసం LBSNAAకి వెళ్ళినప్పుడు ఆర్థోపెడికల్ వైకల్యంతో బాధపడుతున్నారు. అయినా మీరు 25KM ట్రెక్కింగ్, 30KM సైక్లింగ్ చేశారు. మీరు శిక్షణ సమయంలో అకస్మాత్తుగా పర్వతాలు ఎక్కడం మొదలుపెట్టారు. దానికోసం మీరు ఏమి తిన్నారు? ఇప్పుడు నిజం చెప్పండి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో స్పందించిన ప్రఫుల్ల.. 'నేను 2018లో UPSC పరీక్షకు దరఖాస్తు చేశాను. దాని కోసం వైకల్యం సర్టిఫికేట్ పొందాను. AIIMS మెడికల్ బోర్డ్ ముందు వైద్య పరీక్షకు హాజరయ్యాను. ఢిల్లీలోని AIIMS మెడికల్ బోర్డ్ వారు నా వైకల్య ప్రమాణపత్రాన్ని 2019లో మళ్లీ ఆమోదించలేదు. కానీ నాకు ఒక కాలుకు పోలియో ఉంది. దాని వల్ల పరుగెత్తలేకపోయా. నడవడం, సైకిల్ తొక్కడం వచ్చు. అయితే మరోసారి టెస్ట్ చేయించుకుంటే డిసేబుల్, పోలియో కారణంగా ఎడమ కాలు 45 శాతం వైకల్యంతో ఉన్నట్లు డాక్టర్ నిర్ధారించారు. ఆ తర్వాత ఢిల్లీలోని AIIMS కూడా నా వైకల్యాన్నీ గుర్తించింది' అంటూ చెప్పుకొచ్చారు.
నితికా ఖండేల్వాల్:
2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్.. 857 ర్యాంకు సాధించిన నితికా దృష్టి లోపం ఉన్నవారి కోటాలో ఎంపికైంది. అయితే నితికాకు సంబంధించిన వీడియో ఒకటి గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇందులో నితిక స్క్రీన్‌ని చూస్తూ స్టీరింగ్ తిప్పుతోంది. దీంతో దృష్టిలోపంతో బాధపడుతున్న నితికా అద్దాలు ధరించకుండా డ్రైవింగ్ టెస్ట్ ఎలా చేస్తోదంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయంపై మాట్లాడిన నితికా.. 'ఈ వీడియో సుమారు 6 సంవత్సరాల క్రితం నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాను. ఆర్‌టీఓ కార్యాలయంలో ప్రజల డ్రైవింగ్ లైసెన్స్‌లు సక్రమంగా తయారు చేయడం లేదని మాకు చాలా ఫిర్యాదులు వచ్చేవి. దీనిని పరిష్కరించేందుకు ఆర్టీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశాం. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించాం.
ఈ క్రమంలోనే నేను డ్రైవర్ సీట్లో కూర్చొని టెస్ట్ చేశాను. డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్లలేదు. సాధారణంగా ఎవరైనా ఏదైనా చూడలేకపోతే దృష్టి లోపం ఉన్నట్లు భావిస్తారు. వారు ఎంత చూడగలరో వారికి మాత్రమే తెలుసు. నా రెటీనాలో సమస్య ఉంది. కానీ రేపు ఎవరైనా వచ్చి నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నావు అని అడిగితే అందులో నేను ఎంత చూడగలుగుతున్నానో, ఎంత చూడలేకపోతున్నానో చెప్పినా కూడా అర్థం కాదు. ఈ సమస్యను మీరు సున్నితంగా తీసుకోవాలి' అని వ్యాఖ్యానించారు.
She is 𝗡𝗶𝗸𝗶𝘁𝗮 𝗞𝗵𝗮𝗻𝗱𝗲𝗹𝘄𝗮𝗹, 𝗔𝗜𝗥 𝟴𝟱𝟳, (Visual Impairment), 𝟮𝟬𝟭𝟱 𝗜𝗔𝗦 𝗯𝗮𝘁𝗰𝗵 𝗼𝗳𝗳𝗶𝗰𝗲𝗿.
From which angle does she appear to have a visual impairment? Obtaining a PWD certificate seems like a new scam, and the UPSC is being exploited badly. What’s… pic.twitter.com/MQ27owkAHc
— Sakshi (@333maheshwariii) July 14, 2024
ఇంకా అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మారారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. EWS, PWD కోటా కింద అనేక మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందాన్నది సోషల్ మీడియా కథనాల సారాంశం. PWD ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన వాళ్లకు సంబంధించిన బాడీ బిల్డింగ్, సైక్లింగ్, బ్యాడ్మెంట్ ఫొటోలు, వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారు. వారికి నిజంగా శారీరక వైకల్యం ఉంటే ఇది ఎలా సాధ్యమైని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి భారీగా సెటైర్లు, మీమ్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. దీంతో యూపీఎస్సీ ప్రతిష్ట మసక బారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ చైర్మన్ నేడు తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
యూపీఎస్సీ మీద ఇలాంటి వార్తలు రావడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే.. EWS, PWD కోటాలో ఎక్కువ మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారని, దీంతో అర్హులు చాలా మంది అవకాశాలను కోల్పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యున్నత సర్వీసుల్లో ఆలా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన వారు ఉండడం దేశానికి కూడా మంచి కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపించి నిరుద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలని.. ఎవరైనా నిజంగా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Fake PH certificate candidates during UPSC CSE interview .#UPSCscampic.twitter.com/ns45jMIz3B
— खुरपेंच (@khurpenchh) July 15, 2024
IPS Sandhya Rathee never used a fake EWS certificate to clear UPSC exam.... Respect 🫡 pic.twitter.com/pcPHoRTsUm
— ARUSH (@shareef_vyakti_) July 19, 2024
यूपीएससी स्कैम में सबसे ज़्यादा हेरा फेरी EWS और विकलांग सर्टिफिकेट में है ।
सबसे ज्यादा फर्जीवाड़ा भी EWS कोटे में है
पिछलें 5 साल में जीतने भी यूपीएससी परीक्षा पास करने वाले ने इनका लाभ लिया है ।
उन सभी के कागजात की जाँच होना चाहिए ।#UPSC_scam#UPSC#HardikPandya#RajatDalapic.twitter.com/X8a6fryVO2— Ravi K Bhaskar (@imRbhaskar) July 20, 2024
UPSC SCAM
Father- IAS
Car- Audi
Wealth - 100 crores
Category - OBC
Status- Backward
PWD - Fake Disability CertificateNow she is an IAS officer. She destroyed many Unreserved candidates career & also those OBC candidates who are entitle for this reservation ! pic.twitter.com/LpMRGRclL7
— Rajeshwari Iyer (@RajeshwariRW) July 15, 2024
Nikhil kumar clears UPSC under SC Category. But his father name is Jaygovind Pandey who belongs to Brahmin Community. People hate people from SC community and shame them, but happy to use Quota. Now this person might have used Fake Caste Certificate. pic.twitter.com/qmgEtSOG8b
— Prashant Kanojia (@KanojiaPJ) April 23, 2019
Also Read : అల్లకల్లోలంగా చిక్కోలు తీరం.. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు..!