Admit Card: UPSC సివిల్ సర్వీసెస్-మెయిన్ ఎగ్జామ్‌ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . సెప్టెంబర్ 15, 16, 17, 18, 23, 24 తేదీల్లో పరీక్ష జరగనుంది.

Admit Card: UPSC సివిల్ సర్వీసెస్-మెయిన్ ఎగ్జామ్‌ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!
New Update

UPSC Civil Services Main Examination Admit Card Released:సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) మెయిన్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  విడుదల చేసింది. UPSC-CSE ప్రిలిమినరీ పరీక్షలో సక్సెస్‌ఫుల్‌గా ఉత్తీర్ణులైన వారు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. UPSC-CSE మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి , అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ ఐడీ(ID) లేదా రోల్ నంబర్‌ను ఇన్‌పుట్ చేయాలి. అభ్యర్థులు పరీక్ష రోజున  మెయిన్స్ అడ్మిట్ కార్డ్‌తో పాటు ప్రస్తుత ఫోటో ఐడీ(ID) కార్డ్‌ని తీసుకువెళ్లడం తప్పనిసరి.

➼ అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

➊ UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ని విజిట్ చేయండి.

➋ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2023 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.

➌ సంబంధిత విభాగాలలో మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను నమోదు చేయండి.

➍ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించే విధంగా ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయండి.

➎ "లాగిన్" బటన్‌పై క్లిక్ చేయండి.

➏ UPSC మెయిన్స్ సివిల్ సర్వీస్ అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండి.

➐  అడ్మిట్ కార్డ్‌ని ప్రింటవుట్ తీసుకోండి.

For Download Link Click here

పరీక్ష చివరి రోజు సెప్టెంబర్ 24 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని పేరు, పుట్టిన తేదీ, పరీక్ష పేరు మొదలైన ముఖ్యమైన ఆధారాలను కూడా చెక్‌ చేసుకోవాలి.

➼ పరీక్ష డేట్‌:
సెప్టెంబర్ 15, 16, 17, 18, 23, 24 తేదీల్లో పరీక్ష జరగనుంది. మెయిన్స్ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఫస్ట్‌ షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మెయిన్స్ రాత పరీక్ష మొత్తం వెయిటేజీ 1,750 మార్కులు.

ALSO READ: బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రూ.93,000 శాలరీతో CWCలో జాబ్స్‌..వివరాలివే!

#jobs #upsc-civil-services-main-examination #upsc-mains #upsc-mains-admit-card-2023-released #upsc-mains-admit-card #upsc-cse-2023-mains-admit-card #upsc-admit-card-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe