/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/UPSC-chairman-Manoj-Soni.jpg)
UPSC chairman Manoj Soni:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం ముగియడానికి ఐదేళ్ల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పదవి నుంచి వైదొలగుతున్నట్లు సోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మనోజ్ సోనీ దాదాపు పదిహేను రోజుల క్రితం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదని సమాచారం.
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చుట్టూ ఉన్న వివాదాలు.. ఆరోపణలతో రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలవల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు సోనీ UPSC చైర్మన్‌గా మే 16, 2023న ప్రమాణ స్వీకారం చేశారు. అతని పదవీకాలం మే 15, 2029తో ముగియనుంది.
UPSC chairman Manoj Soni tenders resignation due to personal reasons. His resignation has not been accepted yet: Department of Personnel and Training (DoPT) Sources pic.twitter.com/ThvZ3cJOlM
— UPSC NOTES (@UPSC_Notes) July 20, 2024
Also Read : ఈడీ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్