Breaking: సివిల్స్ ఎగ్జామ్ వాయిదా.. రీ షెడ్యూల్ ఇదే!

యూపీఎస్ సీ సివిల్ సర్విసెస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 26న జరగాల్సిన ప్రిలిమ్స్ జూన్ 16కు వాయిదా వేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష మే 26న జరగనుండగా జూన్ 16న నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

New Update
Breaking: సివిల్స్ ఎగ్జామ్ వాయిదా.. రీ షెడ్యూల్ ఇదే!

UPSC 2024 Prelims Exam Postponed: యూపీఎస్ సీ సివిల్ సర్విసెస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఇటీవలే మే 26న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించగా.. ప్రస్తుత మార్పులతో జూన్ 16కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను మే 26న జరగనుండగా జూన్ 16న నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

అక్టోబర్ 19న మెయిన్స్..
ఇక ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి రెండో వారం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను స్వీక‌రించారు. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం జూన్ 16న ప్రిలిమిన‌రీ, మెయిన్స్ అక్టోబర్ 19 నుంచి నిర్వ‌హించ‌నున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు