UPI Payments: బయోమెట్రిక్, ఫేస్ ఐడీలతో UPI పేమెంట్స్.. ఎప్పటి నుంచి అంటే? భారతదేశంలో లక్షలాది మంది UPI ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI పేమెంట్ల భద్రతను పెంచేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఫోన్‌లలో ఫేస్ ఐడీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. By Lok Prakash 13 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి UPI Payments: భారతదేశంలో ఇప్పటి వరకూ లక్షల మంది UPI ద్వారా లావాదేవీలు(UPI Payments) చేస్తున్నారు, అనేక UPI యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు తాజా అప్‌గ్రేడ్లు చేపడుతున్నట్లు సమాచారం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంబంధిత సంస్థలతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ మార్పులు, బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించి UPI లావాదేవీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాయని అంచనా. ఇదిలా ఉంటే, త్వరలో UPI పేమెంట్స్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఫోన్‌లలో ఫేస్ ఐడీ ద్వారా చేయగలగటానికి సిధ్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మనీకంట్రోల్ కథనంలో వెలుగు చూశింది. నేరాలు పెరిగిన నేపథ్యంలో, UPI పేమెంట్ల భద్రతను పెంచేందుకు ఈ విధానాలను అమలు చేయాలని NPCI ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా 4 లేదా 6 అంకెల పిన్ ఉపయోగించి లావాదేవీలు జరుగుతున్నాయి. UPI వ్యవస్థ ఇప్పటికీ అత్యంత సురక్షితంగా ఉంది, అయితే నేరగాళ్లు ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు అకౌంట్లకు పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, UPI వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు చేయడాన్ని NPCI పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు. Also Read: ఆగస్టు 15న ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని భేటీ డిజిటల్ లావాదేవీలలో అదనపు భద్రత కోసం Reserve Bank of India (RBI) సూచించిన మార్గదర్శకాలను బట్టి, NPCI ఈ ప్రతిపాదనను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పిన్ ఆధారిత వ్యవస్థతో పాటు, బయోమెట్రిక్ ఫీచర్లను కూడా కొత్త కాలంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. #upi-payments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి