మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మీ వచ్చేసింది. ఈ వార్త విన్న మెగాఫ్యామిలీతోపాటు అభిమానులు సంబురపడుతున్నారు. కామెనేని ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ , ఉపాసనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గర్భవతి సమయంలోనూ ఉపాసన చాలా యాక్టివిటిస్ లో చక్కగా పాల్గొన్నారు. కాగా ఉపాసన డెలివరీ సమయంలో రామ్ చరణ్, ఉపాసన తల్లి శోభ కామినేని, అత్త సురేఖ కొణిదెల ఆసుపత్రిలోనే ఉన్నారు.
కాగా రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగి 11 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ జంటకు 2021 జూన్ 14న వైభవంగా వివాహం జరిగింది. ఈమధ్యే 11 వ వివాహమహోత్సవం జరుపుకున్నారు. పెళ్లయ్యి పదేళ్లయిన తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనివ్వడంతో మెగాఫ్యామిలీతోపాటు, మెగాప ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.