ఇకపై UPA కాదు I-N-D-I-A.. విపక్షాల భేటీలో కీలక నిర్ణయం

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న విపక్షాలు అందుకు తగ్గట్లు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇన్నాళ్లూ యూపీఏగా ఉన్న కూటమి పేరును I-N-D-I-Aగా నిర్ణయించాయి.

New Update
ఇకపై UPA కాదు I-N-D-I-A.. విపక్షాల భేటీలో కీలక నిర్ణయం

publive-image

ఇండియా నేషనల్  డెవలెప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్..

దేశంలో జాతీయ రాజకీయాలు హీటెక్కాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అధికార, విపక్ష పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఓ వైపు విపక్షాల యూపీఏ కూటమి బెంగళూరులో సమావేశమైతే.. మరోవైపు అధికార ఎన్డీయే కూటమి కూడా ఢిల్లీలో భేటీ అయింది. బెంగళూరులో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో విపక్షాలు తమ కూటమి పేరును మార్చారు. కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్నఈ కూటమి పేరు UPA(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్)గా ఉండగా.. తాజాగా దాని స్థానంలో I-N-D-I-A(ఇండియా నేషనల్ డెవలెప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అనే పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు. అన్ని పార్టీలు చర్చించి ఈ పేరును ఖాయం చేసినట్లు ఆయన తెలిపారు.

అధ్యక్షురాలిగా సోనియా.. కన్వీనర్‌గా నితీశ్..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్వీనర్‌గా ఈ కొత్త కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా రెండు సబ్‌కమిటీలు ఏర్పాటు చేయనున్నారట. ఉమ్మడి కనీస కార్యక్రమం, కమ్యూనికేషన్ పాయింట్‌లను ఖరారు చేయడానికి ఒకటి.. ఉమ్మడి ప్రతిపక్ష కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు ప్లాన్ చేయడానికి మరొకటి ఉంటాయట. గతంలో 2004 నుండి 2014 వరకు UPA చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ విధుల నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆశలేదు..

కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవిపై ఆశలేదని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశంలో విపక్ష నేతలకు స్పష్టంచేయడం విశేషం. ద్వేషం, విభజన, ఆర్థిక అసమానతలు, దోపిడి, ప్రజా వ్యతిరేక రాజకీయాల నుండి దేశ ప్రజలను విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. కాగా విపక్షాల సమావేశానికి సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. కర్ణాటకలోని జేడీఎస్ మాత్రం హాజరుకాలేదు. తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ అధినేత కుమారస్వామి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు