యమునా నదిలో పేలిన గ్యాస్ పైప్‌లైన్, భయాందోళనలో స్థానికులు ఉత్తరప్రదేశ్ జగోష్ గ్రామ సమీపంలోని యమునా నది నీటి అడుగున ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ(IPGL)కి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోయింది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కానీ క్యామ్‌లో మాత్రం కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం.నదిలో 30 అడుగుల ఎత్తులో నీరు(30 Feet Hight Water) ప్రవహిస్తున్నట్లుగా వీడియోలో దృశ్యాలను చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి. By Shareef Pasha 26 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి యూపీ(UP) రాష్ట్రంలోని బాగ్‌పత్ జగోష్(Jagosh) గ్రామ సమీపంలో యమునా నది(Yamuna River)లో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో గాల్లోకి 25-30 అడుగుల ఎత్తులో నీరు చేరిందని ఓ వార్తా సంస్థ నివేదించింది.ఈ ఘటన బుధవారం (26-07-2023) బాగ్‌పత్ ఛప్రౌలీ(Bhagapath Chaprouli) ప్రాంతంలో జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) సుభాష్ సింగ్(Subhas Singh) తెలిపారు.అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు.గాల్లోకి 30 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నట్లుగా వీడియో(Video)లో ఈ దృశ్యాలన్నీ చిక్కుకున్నాయి. గ్యాస్ కంపెనీకి సమాచారం అందించిన SDM #WATCH | Baghpat, Uttar Pradesh: Indian Oil's gas pipeline bursts in the middle of Yamuna in the Jagos village of Baghpat district. pic.twitter.com/33wwVSm54Y— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2023 దీంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.సంఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా సంఘటన గురించి గ్యాస్ కంపెనీకి కూడా సమాచారం అందించారని (SDM) తెలిపారు. అంతేకాకుండా పైప్‌లైన్‌లో గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు కంపెనీకి సంబంధించిన అధికారి వెల్లడించారు.గత నెలలో గౌహతి జల్ బోర్డు నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో అస్సాం(Assam)లోని రాజ్‌గఢ్(Raajghadh) వద్ద వరదలు వచ్చాయి.ఇటీవల ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ఆర్‌జి బారుహ్ రోడ్‌లోని గౌహతి కామర్స్ కాలేజీ(Gouhati Commerce College) సమీపంలో పగిలిపోవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం,ప్రాణనష్టం జరగలేదు. (ASDMA) బృందం పర్యవేక్షణ కానీ లక్షలాది రూపాయల ఆస్తినష్టం కలిగినట్లు సమాచారం.అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ASDMA) బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంతో నీటి ప్రవాహాన్ని(Water Flow) అదుపులోకి తీసుకొచ్చారు.మార్చిలో బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే-అవుట్(HSR LAY-OUT)లోని రెండు ఇళ్లలో గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు పిటిఐ(PTI) నివేదించింది.ఈ నివేదిక ప్రకారం బెంగుళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) వారు రహాదారిని తవ్వుతున్న పనిలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్(Gail Gas Pipe Line) దెబ్బతిన్నట్లు ఆరోపణలు వచ్చాయి. #gas #uttarpradesh #yamuna-river మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి