పాతికేళ్లు.. ప్రతినెల రూ.5.5లక్షలు వచ్చిపడతాయంతే..జాక్ పాట్ కొట్టాడు..!?

ఉత్తరప్రదేశ్ కి చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ కొంత కాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్వహించిన ఫాస్ట్‌ 5 లాటరీలో మొహమ్మద్ ఖాన్ మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెలకు రూ.5,59,822 (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.

New Update
పాతికేళ్లు.. ప్రతినెల రూ.5.5లక్షలు వచ్చిపడతాయంతే..జాక్ పాట్ కొట్టాడు..!?

గొడ్డు చాకిరీ చేసినా నెలకు రూ. 10 వేలు రాని కూలి బతుకులున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించినా అక్కరకు రాని వ్యవసాయంతో విలవిల్లాడుతున్న రైతు కుటుంబాలున్నాయి. లాభం ఊసులేక, పెట్టుబడి తిరిగిరాక అప్పుల ఊబిలో చిక్కిన వ్యాపార జీవులున్నారు.

ఒక వ్యక్తి సిల్వర్ జూబ్లీ జాక్ పాట్ కొట్టాడు. దీసి స్పెషల్ ఏంటంటే..ఏపనీ చేయకుండా ప్రతినెలా లక్షల రూపాయలొచ్చిపడే జాక్ పాట్ కొట్టాడో వ్యక్తి..ఇలా నెలా రెండు నెలలు కాదు..ఏకంగా పాతికేళ్లు వస్తాయన్న మాట.!

ఈ అదృష్టవంతుడిది ఉత్తర్ప్రదేశ్..పేరు మొహమ్మద్ ఆదిల్ ఖాన్ . ఇతగాడికి ఏకంగా నెలకు రూ.5.5 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు వచ్చే జాక్‌పాట్‌ తగిలింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్వహించిన ఫాస్ట్‌ 5 లాటరీలో మొహమ్మద్ ఖాన్ మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు.

నెలనెలా వచ్చేజీతంలో ఈఎమ్ఐ కట్టుకునే సగటు జీతం జీవికి ఇది కాస్త డైజెస్ట్ కాకపోవచ్చు..ఏం చేస్తాం.! కొన్నికొన్ని సార్లు అలా జరిగిపోటుంటాయ్ భరించాల్సిందే..! మన మహ్మద్ ఆదిల్ ఖాన్ ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లాడు.

కొంతకాలంగా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే యూఏఈ.. ఫాస్ట్-5 పేరుతో లాటరీ నిర్వహించింది. ఎందుకు కొన్నాడో లాటరీ టిక్కెట్ కొన్నాడు.

అదృష్టం మహ్మద్ తలుపు తట్టింది. ఈ మేరకు లాటరీ నిర్వాహకులు గురువారం విజేత పేరును ప్రైజ్ మనీ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం విజేతకు నెలకు రూ.5,59,822 (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.

ప్రస్తుతం భారీ లాటరీ విజేతగా నిలిచిన ఆదిల్‌ ఖాన్‌ ఉబ్బితబ్బివుతున్నాడు. అవ్వడామరి నెలనెలా ఐదున్నర లక్షలొచ్చి అకౌంట్లో పడుతుంటే..సరే అతను మాటల్లో చెప్పలేని ఆనందాన్ని మాటల్లో విందాం.

"డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్య సమయంలో డబ్బులు రాబోతున్నాయి. నా కుటుంబానికి నేనే ఏకైక జీవనాధారం. కొవిడ్‌ సమయంలో మా అన్న చనిపోయాడు. అతడి కుటుంబాన్ని కూడా నేనే పోషిస్తున్నాను.

నాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉంది. ఇలాంటి సమయంలో ఇలా అదనపు రాబడి నాకు ఎంతో కీలకం. నేను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు మా కుటుంబం తొలుత నమ్మలేదు.

ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా" అని ఆదిల్‌ ఖాన్‌ చెప్పాడు. పాపం తగిలిన అదృష్టంతో పాటు తగులుకున్న బాధ్యతలు కూడా దిట్టంగానే ఉన్నాయి.

రెంటు,కరెంటు,కూరగాయలు,బట్టలు,బియ్యం,బంగారం,మేక తొడలు,చికెన్ వింగ్స్ ఇలా ఎంత రాయల్ గా బతికినా నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఆదిల్ పిసినారి అయితే అది కూడా అవ్వదు..సరే ఎటు చూసినా రూ. 2.5 లక్షలు వెనకెయ్యొచ్చు.

ఉండండి..కొంత మంది అరబ్ లాటరీ వాళ్ల స్పందన అడుగుతున్నారు.. చెప్పెద్దాం.! ఎమిరైట్స్‌ లాటరీ నిర్వహించే టైచెరస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ఏమంటున్నాడంటే "ఫాస్ట్‌ 5 లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

స్వల్ప సమయంలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్‌ కావడానికి మేము ఫాస్ట్‌ 5ను తీసుకొచ్చాం. విజేత ప్రయోజనాలను ఆశించే ఒకేసారి కాకుండా నెలకోసారి ఇలా డబ్బులు ఇచ్చే ఆలోచన చేశాం" అని ఆయన పేర్కొన్నారు. ఇదంతా విన్నాకా ఇలాంటిదొకటి ఇండియాలో కూడా ఏర్పాటు చేస్తే బావుటుందనిపిస్తుంది కదా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు