UP Tractor Trolley Accident: ఉత్తర్‌ప్రదేశ్ (UP)లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చెరువులో పడగా.. 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ మృతుల్లో 9 మంది చిన్నపిల్లలున్నట్లు తెలుస్తోంది.
పవిత్ర స్నానం కోసం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేసి మొక్కలు అప్పచెప్పేందుకు హరిద్వార్ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు కొంతమందిని కాపాడారు.
This browser does not support the video element.
ఇది కూడా చదవండి: Eye Urine Drops: కంట్లో మూత్రం చుక్కలు.. ఈ అమ్మాయి ప్రతీరాత్రి ఇలా ఎందుకు చేస్తుందో తెలిస్తే షాకే
ఇక విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం అందిస్తామన్నారు.
This browser does not support the video element.