IPL : వేలంలో అమ్ముడుపోలేదు కానీ.. హ్యాట్రీక్ సిస్కర్లను బాాదాడు!

ఫిల్ సాల్ట్‌ మొదట వేలంలో అమ్ముడపోలేదు. కాని అతని పై నమ్మకంతో కేకేఆర్ జట్టు అతనిని కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యట్రిక్ సిక్సర్లుతో విరుచుకుపడ్డాడు.

New Update
IPL : వేలంలో అమ్ముడుపోలేదు కానీ.. హ్యాట్రీక్ సిస్కర్లను బాాదాడు!

IPL 2024 : ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sun Risers Hyderabad) ను ఓడించి విజయంతో IPL 2024 ను ప్రారంభించింది. స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌తో కేకేఆర్‌ విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ బాగా బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్‌కు శుభారంభం అందించాడు. అయితే అవి వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడని మీకు తెలుసా.

వేలంలో ఫిల్ సాల్ట్‌(Phill Salt) ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కొన్ని రోజుల క్రితం, IPL ప్రకటనలో కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యక్తిగత కారణాల వల్ల రాబోయే IPL 2024 నుండి వైదొలిగిన తర్వాత జాసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను చేర్చుకున్నట్లు తెలిపింది. ఫిల్ సాల్ట్ బేస్ ధర రూ.1.5 కోట్లు. కానీ అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరికి అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.

Also Read : పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి రోహిత్‌..! హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ ఎమోషనల్!

2023 IPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) తరుపున సాల్ట్  ప్రాతినిథ్యం వహించాడు. పేలవమైన ప్రదర్శన కారణంగా, అతన్ని ఢిల్లీ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఫిల్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 54 పరుగులు  బాదాడు. ఈ సీజన్లో  అతని స్ట్రైక్ రేట్ 130 కంటే ఎక్కువగా ఉంది.ఈ మ్యాచ్‌లో KKR జట్టు మొదట బ్యాటింగ్‌కి వచ్చింది, రెండవ ఓవర్ వేయటానికి వచ్చిన  జాన్సెన్‌పై వరుసగా 3 హ్యాట్రిక్  సిక్సర్లు తో సాల్ట్ విరుచుకుపడ్డాడు.

Advertisment
తాజా కథనాలు