/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bjp-3-jpg.webp)
కొత్తగా ఎన్నికయ్యాం.. ఇక దున్నేద్దాం.. రూల్ చేసేద్దాం.. అంతా మనదేనని భావించిన సంజయ్‌సింగ్ టీమ్‌కు ఆదిలోనే బలమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెజ్లర్లను లైంగికంగా వేధించాడని బీజేపీ ఎంపీ, మాజీ WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆయన స్నేహితుడు సంజయ్ సింగ్ WFI చీఫ్‌గా గెలుపోందాడు. ఈ ఎన్నికపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని తీసేసి అతని ఫ్రెండ్‌ను తీసుకోచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాక్షిమాలిక్ ఇప్పటికే తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. బజరంగ పూనియా తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇదే సమయంలో WFI కొత్త బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఇక అంతటితో ఆగలేదు.. మరో కొత్త కమిటీ ద్వారా WFI వ్యవహారాలను నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది.
Union Sports Ministry asks Indian Olympic Association (IOA) to create an Ad-Hoc committee to manage and control the affairs of Wrestling Federation Of India(WFI): Sports Ministry source
— ANI (@ANI) December 24, 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) వ్యవహారాలను నిర్వహించడానికి , నియంత్రించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది.
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాల ప్రకారం ఓ కమిటీ WFI వ్యవహారాలను చూసుకుంటుంది. అంటే కొత్తగా ఎన్నికైన సంజయ్‌సింగ్ టీమ్ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు WFIని నియంత్రించకూడదు. ఎన్నికలైన మూడు రోజులకే సంజయ్‌సింగ్‌కు ఈ విధంగా జరగడం పట్ల అతని స్నేహితుడు బ్రిజ్ భూషణ్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఓవైపు రెజ్లర్ల ఆందోళనతో దేశం మొత్తం బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగానే ఉంది. ఓ వర్గం తప్ప ఆయన పట్ల పాజిటివ్‌గా ఉన్నవాళ్లు ఎవరూ లేరు. ఇక ఇదే సమయంలో స్వయంగా కేంద్ర మంత్రిత్వశాఖనే ఈ నిర్ణయం తీసుకోవడం బ్రిజ్‌కు గట్టి దెబ్బగానే చెప్పాలి.
Also Read: ‘కుస్తీ’ ఆటలో కొత్త ట్విస్ట్.. ‘నాకేం సంబంధం లేదు..’ అసలేం జరుగుతోంది?
WATCH: