Telangana: కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు.

New Update
Telangana: 'కేసీఆర్‌ నేరస్తుడు.. ఆయనను వదిలిపెట్టం'.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..

Kishan Reddy Reacts on ED Notice: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీఈ కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ మంత్రి జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఇదే విషయమైన గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. బీజేపీకి, కవిత లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ల్యాండ్ మాఫియా, ఇతర స్కామ్‌లపై బీజేపీ పోరాటం సాగిస్తుందన్నారు.

జమిలి ఎన్నికలపై కీలక కామెంట్స్..

ఇదే సమయంలో జమిలి ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. జమిలి ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికలు గురించే ఎక్కువ కాలం అలోచాంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలా అయితే వ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌పై కిషన్ రెడ్డి రియాక్షన్..

ఇక ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఏజీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై తనదైన శైలిలో సమాధానం చెప్పారు. రాజకీయ కక్షతో అరెస్టులు చేయకూడదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే సమయంలో సంయమనం పాటించాలని హితవు చెప్పారు కేంద్రమంత్రి. ఏదైనా కేసు ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని, సాక్ష్యాలు చూపించాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే సమయంలో అన్ని చెక్ చేశాకే దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.

బాబు అరెస్ట్‌పై బండి సంజయ్ అభిప్రాయం..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ఏమైనా ఉంటే రాజకీయంగా పోరాడాలి తప్ప.. కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిని రూల్స్ పాటించకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. ఎన్నికల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం వలన వైసీపీకి మైనస్ అవుతుందన్నారు సంజయ్.

Also Read:

Balakrishna: బాలయ్య మాస్ వార్నింగ్.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటకు వేటే

Mamata viral Video: చీరతో, చెప్పులు ధరించి మమత బెనర్జీ పరుగులు.. పియానో వాయించిన దీదీ!

Advertisment
తాజా కథనాలు