గుజరాత్‎లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన..!!

గుజరాత్‎లో బిపార్జోయ్ తుపాను తగ్గిన తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్ర పటేల్‌తో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తుపాను ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను పరామర్శించారు. భూజ్ లోని సహాయక శిబిరాల్లో ఉన్న తుపాను బాధితులకు అందిస్తున్న ఆహారం ఇతర సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update
గుజరాత్‎లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి శనివారం గుజరాత్‌లోని కచ్‌లో బిపార్జోయ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్‌, ఇతర ఉన్నతాధికారులతో అమిత్‌ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాండ్విని సందర్శించి తుపాను కారణంగా ప్రభావితమైన ప్రజలను కలుసుకున్నారు. ఏరియల్ రివ్యూ అనంతరం హోంమంత్రి అమిత్ షా SDRF, NDRF సిబ్బందితో సమావేశమయ్యారు. బిపార్జోయ్ తుపాను సమయంలో, ప్రజలను రక్షించడానికి బృందం తీవ్రంగా ప్రయత్నించిందని ఈ విధ్వంసం సమయంలో రెస్క్యూ టీం చురుగ్గా పనిచేసిందని అభినందించారు.

home minister amit shah conducted aerial survey

ఇక వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారిందని, రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. IMD ప్రకారం, ఆగ్నేయ పాకిస్తాన్‌పై తుపాను శుక్రవారం రాత్రి 11:30 గంటలకు బలహీనపడింది. ఇది నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ధోలావీరాకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో బలహీనపడిందని ఐఎండీ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా, తుపాను ప్రభావంతో కచ్‌లోని భుజ్‌లో పలు చెట్లు నేలకూలడంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం శుక్రవారం సహాయక చర్యలు చేపట్టింది. గురువారం సాయంత్రం బిపార్జోయ్ తుపాను రాష్ట్ర తీర ప్రాంతాలను తాకడంతో మొత్తం ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రూపన్ బందర్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisment
తాజా కథనాలు