సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...భారీగా తగ్గిన టీవీ, ఫ్రిజ్ కూలర్ల ధరలు..!! పండుగల సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చింది. ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్, మొబైల్ సహా అనేక ఇతర గృహోపకరణాలపై జీఎస్టీ రేటును ప్రభుత్వం తగ్గించింది. జీఎస్టీ రేటు తగ్గించిన వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా చౌక ధరకే లభించనున్నాయి. By Bhoomi 01 Jul 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి వస్తుసేవల పన్ను(GST)ని ప్రవేశపెట్టి నేటితో ఆరేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా జీఎస్టీ పన్ను శ్లాబుల ద్వారా 2017 తర్వాత చౌకగా మారిన వస్తువులను జాబితాను కేంద్రం రిలీజ్ చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నలు తగ్గించడం ద్వారా చౌకగా మారిన వస్తువుల జాబితాలో టీవీ, మొబైల్, ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై GST రేట్లను భారీగా తగ్గించింది. తద్వారా మీరు ఈ వస్తువులన్నింటినీ తక్కువ ధరకు పొందుతారు. ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లపై జీఎస్టీని ప్రభుత్వం 31 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. మొబైల్ ఫోన్లు, ఎల్‌ఈడీ బల్బులు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర అనేక వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, ఎల్‌ఈడీ బల్బులు, స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌లు వంటి పరికరాలపై ఇంతకుముందు 31.3 శాతం జీఎస్‌టీ విధించింది. అయితే ఇప్పుడు ఈ పరికరాలు 12 శాతం జీఎస్టీని తగ్గించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, మీరు 27 అంగుళాలు లేదా చిన్న సైజు టీవీని కొనుగోలు చేస్తే, మీరు మునుపటి కంటే చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు 27 అంగుళాల టీవీలపై ప్రభుత్వం 31.3 శాతం జీఎస్టీని విధించగా, ఇప్పుడు 18 శాతం జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తోంది. అంటే ఇప్పుడు మీకు తక్కువ ధరకే 27 అంగుళాల టీవీలు లభిస్తాయి, అయితే పెద్ద సైజు టీవీల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఏఏ వస్తులపై పన్ను ఎంత శాతం తగ్గిందో చూద్దాం; -27 అంగుళాల వరకు టీవీలపై, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్స్ ర్, జ్యూసర్ వంటి ఎలక్ట్రిక్ ఉపకరణాలు,గీసర్, ఫ్యాన్, కూలర్లు, ఎల్పీజీ స్టవ్ , 18 శాతానికి తగ్గింది. - ఎల్ఈడీపై 15 శాతంగా ఉన్న పన్ను 12 శాతం, కుట్టు మెషీన్లపై 16 శాతంగా ఉన్న పన్ను 12 శాతం, యూపీఎస్ లపై 28 శాతంగా ఉన్న పన్ను 18 శాతానికి తగ్గింపు, కిరోసిన్ దీపాలపై 8 శాతంగా ఉన్న పన్ను 5శాతానికి తగ్గించింది. వాక్యూమ్ ఫ్లాస్క్, వ్యాక్సూమ్ పాత్రలపై 28 శాతంగా ఉన్న పన్ను 18 శాతానికి తగ్గింది. మొబైల్ ఫోన్లపై 31.3 శాతంగా పన్ను 12 శాతానికి తగ్గింది. జీఎస్టీతో పన్ను విధానంలో భారీ సంస్కరణలు వచ్చిన సంగతి తెలిసందే. ఇప్పుడు ప్రతి నేల జీఎస్టీ వసూళ్లు సులభంగా రూ. లక్ష కోట్లు దాటుతున్నాయి. కొన్ని సార్లు రూ. లక్షన్నర కోట్లు వసూలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి