/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/KISHAN-REDDY.jpg)
ప్రధానమోడీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ బుధవారం నాడు సమావేశం అయ్యింది. మంత్రి వర్గ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సమావేశానికి హాజరుకాకపోవడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడంతో కిషన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ విషయంపై కిషన్ రెడ్డి నుంచి గానీ...ఆయన సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. కిషన్ రెడ్డి ఢిల్లీలో తన అధికారిక నివాసంలోనే ఉన్నప్పటికీ పర్యాటకశాఖకు చెందిన ఇతర అధికారులు కూడా రాకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం ప్రధానిని కలిసి కిషన్ రెడ్డి తన రాజీనామా లేఖను అందిస్తారానే చర్చ కూడా జోరుగా సాగుతోంది.
అటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులకు పూనుకుంది. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ నుంచి బండి సంజయ్ ను తొలగిస్తూ..కిషన్ రెడ్డి అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియమించింది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడంపై కూడా ఆయన ఇంతవరకు స్పందించనూ లేదు. పార్టీ అధిష్టానం బీజేపీ స్టేట్ చీఫ్ గా నియమించిన సమయంలో కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పదవి గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఉత్సవాల పాల్గొన్న అనంతరం హుటాహుటినా కిషన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ ఉదయం తన అధికారిక నివాసంలోనూ ఇతరులతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తుంటే కిషన్ రెడ్ది మంత్రి పదవికి రాజీనామ చేయడం తథ్యం అనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టేందుకు కిషన్ రెడ్డి విముఖత చూపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.