Budget Aspirations: బడ్జెట్ వచ్చేస్తోంది.. రైతన్నల ఆశలు తీరుతాయా? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం దగ్గరకు వచ్చేస్తోంది. దేశంలో రైతులు బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో తమ కోసం ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేస్తుందేమో అని వారి ఆశ. రైతుల కోరికలు ఏమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 23 Jan 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Budget Aspirations4: కేంద్ర బడ్జెట్ వచ్చే సమయం దగ్గరకి వచ్చేస్తోంది. బడ్జెట్ వస్తుందంటే.. అందరికీ ఎన్నో ఆశలు. అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్ లో తమకోసం ప్రభుత్వం కొత్తగా పథకాలు ఏమైనా తెస్తుందా అని ఎదురుచూస్తారు. దిగువ తరగతి ప్రజలు ధరలు తాగ్గించడానికి చర్యలు ఏమైనా ఉంటాయా అని చూస్తారు. మధ్యతరగతి ఉద్యోగ జీవులు పన్నుల్లో తమకేమైనా వెసులుబాటు దొరుకుతుందేమో అని చూస్తారు. ఇక వ్యాపారాలు తమకు ఏదైనా రాయితీలు ప్రకటిస్తారా అని లెక్కలు వేసుకుంటారు. అదేవిధంగా రైతులు కూడా తమకు బడ్జెట్ లో ఏదైనా మేలు చేకూర్చే పథకాలు వస్తాయా అని ఎదురు చూస్తారు. ఈసారి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. ఎన్నికలు రాబోతున్నాయి. అందువల్ల ప్రధానంగా ఈ బడ్జెట్ సంవత్సరంలో అయిన లెక్కల్ని పార్లమెంట్ ముందు ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. రాబోయే సంవత్సరానికి సంబంధించి పెద్ద ప్రకటనలు ఈ బడ్జెట్(Union Budget 2024) లో ఉండవు. అయినా, రైతన్నలు బడ్జెట్ లో ఏమి కావాలని కోరుకుంటున్నారు అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రైతులు ముఖ్యంగా కోరుకునేది క్రాప్ లోన్స్ పై వడ్డీ తగ్గింపు. ఎందుకంటే, ఖర్చులు పెరిగిపోతున్నాయి. రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పంట వేసుకోవడానికి పెట్టుబడి కోసం లోన్ తీసుకోక తప్పదు. రైతుల కోసం సంవత్సరానికి 3లక్షల రూపాయల క్రాప్ లోన్ ఇస్తున్నారు. దీనిపై 7% వడ్డీ వసూలు చేస్తారు. అయితే, ఈ లోన్ సరైన సమయంలో తీర్చిన రైతులకు 3% వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు ఇప్పుడు క్రాప్ లోన్స్ పై వడ్డీ రాయితీ కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, డిసెంబరు 2023 వరకు రూ. 20 లక్షల కోట్ల అగ్రి-క్రెడిట్ లక్ష్యంలో(Budget Aspirations) దాదాపు 82 శాతం సాధించారు. ఈ కాలంలో ప్రైవేట్ - ప్రభుత్వ బ్యాంకుల ద్వారా దాదాపు రూ. 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు భారీగా పెరగవచ్చని అనుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. వ్యవసాయ-క్రెడిట్‌పై ఎక్కువ దృష్టి పెడుతుంది ప్రభుత్వం. మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక ప్రచారాలను అమలు చేస్తోంది. Budget Aspirations: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది. డేటా ప్రకారం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాన్ని పొందారు. మార్చి 31, 2023 నాటికి దాదాపు రూ. 8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ గృహాలు, గృహాల భూమి, పశువుల హోల్డింగ్‌ల పరిస్థితుల అంచనాపై 2019 NSS నివేదిక ప్రకారం, రుణగ్రస్తులైన వ్యవసాయ కుటుంబాల శాతం దేశములో 50.2 శాతంగా ఉంది. ఇందులో 69.6 శాతం బకాయి రుణాలు సంస్థాగత వనరుల నుంచి తీసుకున్నవే. Also Read: బాల రాముడు కొలువయ్యే వేళ.. బంగారం ధరలు ఎలా వున్నాయంటే.. ఈ రుణాలు తీసుకోవడం.. వాటిని తీర్చడం.. ప్రభుత్వం రాయితీ ఇవ్వడం ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ, అప్పట్లో అంటే 2019 సంవత్సరంలో ఎన్నికల సమయంలో ఇలాంటి మధ్యంతర బడ్జెట్(Budget Aspirations) ద్వారా రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రవేశ పెట్టారు. దీనిలో నేరుగా రైతుల ఖాతాలోకి 6 వేల రూపాయలను జమ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యంతర బడ్జెట్ లో కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇచ్చే డబ్బును పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. రైతులు కోరుకునే ఇంకో కోరిక.. MNEREGA నిధులను పెంచాలని. దీనివలన చిన్న రైతు కుటుంబాలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. రుణాలు, రుణ మాఫీలు, ఎరువుల సబ్సిడీలు ఇవన్నీ రైతుల జేబులోకి చేరడం అంత సులువు కాదు. కానీ, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా డబ్బు నేరుగా రైతుల(Budget Aspirations) ఖాతాలకు చేరిపోతుంది. MNEREGA కేటాయింపులు పెరిగితే, అందరికీ పని దొరికే అవకాశాలు పెరుగుతాయి. చిన్న రైతులుగా పంటలు వేసినా.. వాటి ఫలాలు అందేసరికి ఏదైనా జరగవచ్చు. MNEREGA ద్వారా పనులు దొరికితే, వారికి పెద్ద సహాయం దొరికినట్టే. Watch this interesting Video: #union-budget-2024 #budget-aspirations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి