Union Budget: బడ్జెట్ వచ్చేస్తోంది.. మరి టాక్స్ విషయంలో కనికరం ఉంటుందా?

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి దాదాపు 9 రోజులే సమయం ఉంది. ఈ బడ్జెట్ లో పన్ను విధానంలో ఏదైనా వెసులుబాటు ఆర్ధిక మంత్రి తీసుకువస్తారా? అనే ఆశ సాధారణ ప్రజల్లో నెలకొని ఉంది. దీనిపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Union Budget: బడ్జెట్ వచ్చేస్తోంది.. మరి టాక్స్ విషయంలో కనికరం ఉంటుందా?
New Update

Union Budget: మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో, ఉద్యోగులు, చిన్న ఆదాయాల వారి దృష్టి టాక్స్ విధానంపైనే ఉంది. ఈ బడ్జెట్ లో టాక్స్ విధానంలో ఏమైనా ఊరట ఉంటుందా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఐటీ, ఈ విషయంపై ఆర్థికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ఎన్నికలకు ముందు.. వచ్చే నెలలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు కొందరు. అలాగే, మహిళలకు ప్రత్యేకంగా కొంత పన్ను మినహాయింపును ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. అయితే, ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఎటువంటి మార్పులు ఉడకపోవచ్చని కూడా చాలా మంది చెబుతున్నారు. నిజానికి మధ్యంతర బడ్జెట్(Union Budget) కేవలం గత రెవెన్యు లెక్కల వరకే పరిమితం అవుతుంది. కాకపోతే ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు ప్రకటించవచ్చు. కానీ ప్రత్యేకంగా ప్రజలకు నేరుగా మేలు చేసే విధానాల ప్రకటన ఉండే అవకాశం ఉండదు. కానీ, బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులకు సంబంధించిన ఒక పథకాన్ని ఇలా మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానిని ఎన్నికల లోపులోనే అమలులోకి తీసుకువచ్చిన సంఘటన జరిగింది. 

ఆర్థిక మంత్రి సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024-25 మధ్యంతర బడ్జెట్‌(Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్. ఈ విషయంలో కొందరు నిపుణులు  మధ్యంతర బడ్జెట్‌లో, శ్రామిక ప్రజలు, మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్ను విషయంలో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పారు. స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.  అయితే పేద-దిగువ మధ్యతరగతి ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించడం లేదని కూడా గుర్తుంచుకోవాలి.

Also Read: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా 

ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనానికి సంబంధించిన విషయంలో సరిగ్గా ఊహించలేం అని ఎక్కువ మంది నిపుణులు అంటున్నారు. ఆర్థిక అంశాలే కాకుండా, ఇది అనేక ఇతర విషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్(Union Budget) కావడంతో పన్ను చెల్లింపుదారుల ఓట్లను ఆకర్షించేందుకు కొన్ని రాయితీలు కల్పించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఇది మధ్యంతర బడ్జెట్(Union Budget) కావడంతో పన్ను విధానంలో పెద్ద మార్పును ఆశించకూడదు అని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మొత్తం సంవత్సరపు బడ్జెట్‌ను సమర్పించే వరకు ఖర్చుల పై ఆమోదం పొందడం మాత్రమే ఈ మధ్యంతర బడ్జెట్ ఉద్దేశ్యం.  ఏది ఏమైనప్పటికీ, పన్ను వ్యవస్థ మరియు నిర్మాణంలో తరచుగా మార్పులు వర్తింపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ఆదాయపు పన్ను విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయని పెద్దగా ఆశించాల్సిన పని లేదనేది వారు చెబుతున్న మాటు. 

మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్(Union Budget) లో పన్నుల తగ్గింపు లేదా పన్ను విధానంలో మార్పులు వంటివి పెద్దగా ఉండే అవకాశం లేదనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మధ్యంతర బడ్జెట్ లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి. కానీ వేతన జీవులు మాత్రం .. మధ్యాంతరమో.. మరోటో.. టాక్స్ భారం తగ్గించే ఆలోచన చేస్తే బావుండును అని ఆశపడుతున్నారు. 

Watch this interesting Video:

#union-budget-2024 #2024-budget-expectations #budget-2024-25
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe