భార్యాభర్తలు, ప్రియుడు, ప్రియురాలి మధ్య సంబంధాలు ప్రేమ, నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉంటాయి. స్నేహం, నమ్మకం లేదా ప్రేమ సంబంధం నుంచి తప్పిపోయినట్లయితే, అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు, చీలికలకు దారి తీస్తుంది. ఇద్దరు వ్యక్తులు నిరంతరం పోరాడుతూ ఉంటే, తరచుగా ఒకరితో ఒకరు విభేదిస్తూ ఉంటే అది అనారోగ్య సంబంధమే(Relation) అవుతుంది. మీరు అనారోగ్యకరమైన సంబంధంలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ నాలుగు చిట్కాలు సహాయపడతాయి.
పట్టించుకోకపోవడం:
ఒక మంచి భాగస్వామి మీ సమస్యలను, ప్రశ్నలను వింటారు. వాటి గురించి మీతో చర్చిస్తారు. అయితే.. మీరు మీ భాగస్వామికి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తుంటే.. లేదా ఏదైనా, ఒక ప్రశ్న మనస్సులో ఉంటే, దాని గురించి చర్చించకుండా, దాని గురించి మాట్లాడకుండా నిర్లక్ష్యం చేయడం అనారోగ్య సంబంధానికి సంకేతం.
సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తున్నారా?
మీ భాగస్వామిని ఒక ప్రశ్న అడిగినప్పుడు.. అతను/ఆమె కారణం లేకుండా నవ్వడం, యాదృచ్ఛిక విషయాల గురించి మాట్లాడటం, విషయాన్ని మార్చడం ద్వారా అసలు మేటర్‌ను తప్పించుకుంటే.. అది అనారోగ్య సంబంధానికి ఓ సంకేతం. మీరు అడిగే ప్రశ్నకు మీ భాగస్వామి నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. కానీ వారు అలా చేయకపోతే అది పారదర్శక సంబంధం కాదు.
శ్రద్ధ చూపడం లేదా?
మీ భాగస్వామి మీకు చెప్పకుండా లేదా మీ గురించి ఆలోచించకుండా పనులు చేస్తూ ఉంటున్నారా? ఇది మీపై వారికి శ్రద్ధ లేదని చెప్పడానికి సంకేతం. అడిగిన తర్వాత ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉంటే, ఆ సంబంధం అనారోగ్యకరమైనది కావచ్చు.
ఒకరినొకరు గౌరవించుకోరు:
ప్రతి రిలేషన్‌షిప్‌లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. నిత్యం ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే, ఆ సంబంధంలో గౌరవం లేకపోవడానికి ఇది సంకేతమని చెప్పవచ్చు. ఇలాంటి గొడవలు ఇద్దరినీ ప్రభావితం చేస్తాయి. ఇది కూడా అనారోగ్యకరమైన సంబంధానికి సంకేతం కావొచ్చు.
Also Read: కంగనా రనౌత్ ప్రేమలో పడిందా? ఆమెతో చేతులు కలిపి నడుస్తున్న మిస్టరీ మ్యాన్ ఎవరు?
WATCH: