AP: 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా' పిల్లలను బెదిరించిన తండ్రి.. ఇంతలోనే ఏం జరిగిందంటే?

New Update
AP: 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా' పిల్లలను బెదిరించిన తండ్రి.. ఇంతలోనే ఏం జరిగిందంటే?

Vishaka: 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా' అంటూ.. పిల్లల అల్లరి మాన్పించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ విషాదకరమైన ఘటన విశాఖప ట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ కు చెందిన చందన్ కుమార్ (33) అనే వ్యక్తి రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్నారు. 89వ వార్డు కొత్త పాలెంలో కుటుంబంతో ఐదేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు.

Also Read: చిన్నపాటి హోటల్లో టిఫిన్ తిన్న మంత్రి.. వీడియో వైరల్..!

అయితే, గురువారం రాత్రి కుమార్తె(7), కుమారుడు(5) అతడి చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించివేసి రచ్చ రచ్చ చేశారు. పిల్లల చేష్టలకు చందన్ కుమార్ చిరాకు పడుతుండగా భార్య అడ్డుపడింది. దీంతో భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం జరిగింది.  విసుగెత్తిన చందన్ కుమార్ తనకు ప్రశాంతత లేకుండా చేస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని పిల్లలను, భార్యను బెదిరించారు. అయినా కూడా ఎవరూ వినిపించుకోలేదు.

Also Read: పోలీసుల తీరుపై వర్మ సీరియస్.. వారిపై కేసు నమోదు చేయాలని లేదంటే..!

దీంతో ఇంట్లోని ప్యాన్ కు చీర కట్టి మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే, అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మృత దేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు